అమల్లోకి రానున్న న్యూ వేజ్ కోడ్ – ఉద్యోగులకి వారానికి మూడు రోజులు సెలవు

అమల్లోకి రానున్న న్యూ వేజ్ కోడ్ – ఉద్యోగులకి వారానికి మూడు రోజులు సెలవు

by Anudeep

Ads

సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేసిన వివరాల ప్రకారం అక్టోబర్ నెల నుండి న్యూ వేజ్ కోడ్ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం గా ఇకపై ఉద్యోగుల పనివేళలు, జీతం మరియు సెలవులు విషయంలో మార్పులు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపై ఉద్యోగులు రోజుకి 12 గంటలు పని చేయవలసి ఉంటుంది దీని వల్ల వారానికి మూడు రోజులు సెలవు తీసుకునే అవకాశం వారికి దొరుకుతుంది, కొంతమంది కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం వారు తెలియజేయునది ఏమనగా ఉద్యోగులు రోజుకి ఎనిమిది గంటలు పని చేసినట్లైతే వారం రోజులు ఉద్యోగి పని చేయవలసి ఉంటుంది కానీ రోజుకి 12 గంటలు పని చేయడంవల్ల వారానికి మూడు రోజులు గరిష్టంగా సెలవు తీసుకునే అవకాశం దొరుకుతుంది.

Video Advertisement

అంతేకాక ఇకపై ఉద్యోగులు తీసుకునే సెలవులు 240 నుండి 300లకు పెరగనున్నాయి. కొత్త వేజ్ రూల్ ప్రకారం కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చే బేసిక్ సాలరీ అనేది ctc (cost of company ) లో 50% గా ఉండాలి. ప్రస్తుతం కంపెనీలు అన్నీ కూడా తమ ఉద్యోగికి ఇచ్చే బేసిక్ శాలరీ ని తగ్గించి దానికి బదులుగా అలవెన్సుస్ ని ఎక్కువగా అందిస్తున్నాయి. కొత్త నియమం ప్రకారం ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీ పెంచడంవల్ల ఉద్యోగి యొక్క పిఎఫ్ అమౌంట్ అనేది కూడా పెరుగుతుంది దీనివల్ల ఉద్యోగి చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీ అనేది తగ్గుతుంది. అంతేకాక ఓవర్ డ్యూటీ పని వేళలా లెక్కింపులో కూడా మార్పులు చేశారు దీని ప్రకారం ఇకపై 15 నుండి 30 నిమిషాల లోపు ఎంతసేపు చేసినా 30 నిమిషాలు గా లెక్కించడం జరుగుతుంది


End of Article

You may also like