“ఓంకార్” దర్శకత్వంలో మరొక కొత్త కాన్సెప్ట్..! ఎలా ఉందంటే..?

“ఓంకార్” దర్శకత్వంలో మరొక కొత్త కాన్సెప్ట్..! ఎలా ఉందంటే..?

by Mounika Singaluri

Ads

ప్రముఖ బుల్లితెర యాంకర్ ఓంకార్ డైరెక్టర్ గా మారి రాజు గారి గది సిరీస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే జోనర్ లో  అందర్నీ భయపెట్టడానికి మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆరు ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూ చూద్దాం….!

Video Advertisement

టీజర్, ట్రైలర్ల నుండి ఆకట్టుకున్న మాన్షన్ 24 వెబ్ సిరీస్ లో స్టార్ క్యాస్టింగ్ ఏ ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, రావు రమేష్, తులసి, అవికా గోర్, మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ యాక్టర్లను సిరీస్ మొత్తం నింపేసాడు ఓంకార్ అన్నయ్య.

new web series released on ott

 

ఇంక కథ విషయానికొస్తే అమృత (వరలక్ష్మి శరత్ కుమార్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అమృత తండ్రి కాళిదాస్ (సత్యరాజ్) పురావస్తు శాఖలో పనిచేస్తూ తవ్వకాల్లో దొరికిన విలువైన సంపదతో పారిపోయాడని కథనాలు పుట్టుకొస్తాయి. అతనిపై దేశద్రోహి అన్న ముద్ర కూడా పడుతుంది. అమృత కుటుంబం పైన సమాజం మానసిక దాడి చేస్తుంది. అమృత తల్లి (తులసి)హాస్పిటల్ పాలవుతుంది. అయితే అమృత మాత్రం ధైర్యంగా తన తండ్రి దేశద్రోహి కాదని ఒక నిజాయితీపరుడని అతని కూతుర్ని తాను అంటుంది.

new web series released on ott

అతని తండ్రిని నిర్దోషిగా నిరూపించాలని అతను చివరిగా వెళ్లిన ఊరికి ఉత్తరాన ఉన్న ఒక కొండపైన మాన్షన్ కి వెళ్తుంది. అక్కడ అమృతకి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు ఏంటి ?అమృత వాటిని ఏలా ఎదుర్కొంది. ఆ మాన్షన్ లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అవే కాళిదాసుని చంపేశాయ? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మాన్షన్ 24 సిరీస్ ను పూర్తిగా చూడాల్సిందే.

new web series released on ott

 

నటీనటుల పరిశీల విషయానికొస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ నటనకు పేరు పెట్టడానికి ఏమీ లేదు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా బాగా చేసింది. క్లైమాక్స్ లో తన నట విశ్వరూపం చూపించింది. రావు రమేష్ నిడివి తక్కువ ఉన్న పాత్రలో నటించారు. సత్యరాజ్ పాత్ర చుట్టూ కథ తిరిగిన కూడా అంత ప్రాధాన్యత ఉండదు. మిగతా నటీనటులందరూ తమ పరిధిలో బాగానే నటించారు.

new web series released on ott

టెక్నీషియన్స్ విషయంలో మొదటగా మాట్లాడుకోవాల్సింది ఓంకార్ అన్నయ్య గురించి. రాజు గారి గది సీక్వెల్స్ హిట్ అయ్యింది అంటే దానికి ప్రధాన బలం కామెడీ. ఈ మాన్షన్ 24 లో ఓంకార్ అన్నయ్య కామెడీనే పక్కన పెట్టేసాడు. సీరీస్ ను కొత్తగా ప్రజెంట్ చేయడానికి బాగానే ట్రై చేశాడు. హర్రర్ సిరీస్ కి ట్విస్టులే కీలకం, ఈ సిరీస్ లో త్రిల్లింగా అనిపించే అంశాలు ఏమీ పెద్దగా ఉండవు.

new web series released on ott

పాటలను అనవసరంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సీరీస్ కు తగ్గట్టు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఫైనల్ గా చూస్తే ఈ మాన్షన్ 24 కొన్ని చోట్ల భయపెట్టింది. కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. కాకపోతే బాగా ఎంగేజ్ చేస్తుంది.హర్రర్ సిరీస్ లను ఇష్టపడే ప్రేక్షకులు ఈ మాన్షన్ 24 పైన ఒక లుక్కు వెయ్యొచ్చు.

ALSO READ : సైలెంట్ గా రిలీజ్ అయిన విజయ్ ఆంటోనీ కొత్త సినిమా..! ఎలా ఉందంటే..?


End of Article

You may also like