Ads
పెళ్ళైన రెండు నెలలకే భార్యని హత్య చేసేసాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన ఖమ్మం లో చోటు చేసుకుంది. నవ వధువుని హత్య చేసిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలు మలుపులు తీసుకున్న ఈ ఉదంతం లో తాజాగా హత్య కు గల కారణాలు తెలిసి వచ్చాయి. ఇంత చిన్న కారణానికే హత్య చేయడానికి సిద్ధపడ్డాడా అని స్థానికులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లా ఎర్రుపాలం మండలం అయ్యవారి గూడెం నివాసి అయిన నాగ శేషు రెడ్డి కి, వారి సమీప బంధువు నవ్య రెడ్డి కి వివాహం జరిగింది. నాగ శేషు రెడ్డి పూణెలో జాబ్ చేస్తున్నాడు. నాగ శేషు రెడ్డి, నవ్య రెడ్డి బావ మరదలు అవుతారు. నవ్య కు మేనమామ కొడుకే నాగ శేషు రెడ్డి. నవ్య రెడ్డి పెళ్లి కి ముందు సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో బీటెక్ రెండవ సంవత్సరం చదివేది. తొలుత భార్య కనిపించడం లేదంటూ నాగశేషు రెడ్డి ఫిర్యాదు చేయడం తో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.
అయితే భర్త పై అనుమానంతోనే సిసి టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అతని పై నిఘా ఉంచారు. నాగ శేషురెడ్డి పై పోలిసుల అనుమానం నిజమైంది. పోలీసులు నిలదీయడం తో తానె హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ముందుగానే ప్లాన్ ప్రకారం ఆమె ను బైక్ పై ఎక్కించుకుని కుక్కల గుట్ట వద్ద కు తీసుకెళ్లి.. ఆమెకి మత్తు మందు ఇచ్చి హత్య చేసాడు. ఆ తరువాత ఆమె ఫోన్ నుంచే.. ఆమె తండ్రికి మెసేజ్ పెట్టాడు. బ్యాక్ లాగ్ లు ఎక్కువ ఉన్న కారణం గా, వీటిని చదవలేకే ఆత్మహత్య చేసుకుంటున్న అని తండ్రికి మెసేజ్ పెట్టి.. ఆ ఫోన్ ని అక్కడే వదిలేసాడు. ఆ తరువాత పోలీసులకు తన భార్య కనిపించడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చాడు.
వీరిద్దరికి గత కొన్ని రోజులు గా మనస్పర్థలు రావడం తోనే నాగశేషు రెడ్డి నవ్య ను హత్య చేయాలనీ భావించినట్లు తెలుస్తోంది. ఆమె ఫోన్ లో మరొకరితో ఎక్కువ సేపు చాట్ చేస్తుండడం తో నాగశేషు రెడ్డి ఆమె పై అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరొకరితో క్లోజ్ గా ఉంటోందని భావించి ఆమె ని హత్య చేయాలనీ నిర్ధారించుకున్నాడు.
End of Article