Ads
ఇటీవలి కాలంలో రోజులు ఎంత దారుణంగా తయారు అవుతున్నాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎవరిని నమ్మలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. పెళ్లి చేసుకొని మోసం చేసే వాళ్ళు కొందరైతే.. మోసం చేయడానికే పెళ్లి చేసుకునే బాపతు కూడా తయారు అవుతున్నారు. తాజాగా జరిగిన ఈ సంఘటన రెండో బాపతుకు చెందింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మోసం చేయడం కోసమే పెళ్లి చేసుకుంది. కాళ్ళ పారాణి ఆరకముందే తన అత్తింటివారిని మోసం చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది..
Video Advertisement
పెళ్ళైన మూడు రోజులకే ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోన కార్తీక్ చౌక్ కు మహారాష్ట్రకు చెందిన నిఖితను ఇచ్చి వివాహం జరిపించారు. వీరి వివాహం మార్చి 19న నగరంలోని చింతామన్ దేవాలయంలో జరిగింది. అయితే సచిన్ తివారి వయసు నలభైలలో ఉంటుంది. వయసు ఎక్కువ కావడంతో ఎక్కువ మందిని పిలవకుండా పరిమిత సంఖ్యలో బంధువుల మధ్య సచిన్ వివాహం చేసుకున్నారు.
అయితే.. కొత్త కోడలు కావడంతో నిఖితను అందరు బాగానే చూసుకున్నారు. ఆమె కూడా అత్తమామలను, భర్తను ప్రేమించేది. రోజూ వారికి భోజనం వడ్డించడం.. భోజనాలు అయ్యాక వారికి గ్లాసులో పాలు ఇవ్వడం చేసేది. రోజూ రాత్రి పాలు ఇవ్వడం అలవాటు చేసింది. అయితే.. కొత్త కోడలు కావడంతో ఆమె చెప్పినట్లే అందరు పాలు తాగేవారు. అయితే, మూడవ రోజూ కూడా ఇలానే పాలు తాగి, అందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఉదయం లేచి చూడగానే ఇంట్లోని యాభై వేల రూపాయల నగదు, బంగారం మాయమైంది.
నిఖిత కోసం ఎంత వెదికినా కనిపించలేదు. దీనితో అనుమానం వచ్చిన సచిన్ నిఖిత సంబంధం కుదిర్చిన వారికీ, నిఖిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసారు. అయితే ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్ రావడంతో సచిన్ అనుమానించారు. దీనితో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. చివరకు పెళ్లి వారిని తీసుకొచ్చిన వాహనం డ్రైవర్ కలిశారు. అయితే.. అతను తనకేమీ తెలియదని చెప్పాడు. అయినా అనుమానంతో ఫ్రెండ్ తో ఆ డ్రైవర్ కు ఫోన్ చేయించి వధువు కావాలని అడిగించారు. అందుకు అతను ఓంకారేశ్వర్ రావాలని చెప్పడంతో.. పోలీస్ సాయం తో చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. ఈ నిందితులంతా మహారాష్ట్ర బుల్దానా వాసులని తేలింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
End of Article