Home Filmy Adda చిరంజీవి తన సతీమణితో కలిసి అమెరికా వెళ్లడానికి వెనుక ఉన్న కారణం ఇదేనా..?

చిరంజీవి తన సతీమణితో కలిసి అమెరికా వెళ్లడానికి వెనుక ఉన్న కారణం ఇదేనా..?

by Anudeep

అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమను… తనదైన నడకతో, డ్యాన్సులతో కుర్రాళ్ళను షేక్ ఆడించింది ఎవరు అంటే గుర్తొచ్చే హీరో మెగా స్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తితోనే ఎంతో మంది సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.

కానీ మెగాస్టార్ చిరు ఇటీవల కాస్త అనారోగ్యానికి గురయ్యారని… అందుకే ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అయితే భోళా శంకర్ మూవీ షూటింగ్ పూర్తయిన తరువాత చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అమెరికా ట్రిప్ కు సరదాగా వెళుతున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి నిజానికి వెకేషన్ కి కాదని… ఆయన అమెరికాలో ఆపరేషన్ చేయించుకోడానికి వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ వార్త తెలియగానే మెగా స్టార్ అభిమానులు ఆందోళన చెందారు.

chiranjeevi faces troubles in 2nd innings

అయితే చిరంజీవి కాలికి కాస్త ఇబ్బందిగా ఉండటంతో… సరి చేసుకునేందుకు అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్నారని… ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రత్యేకంగా ఆపరేషన్ కు వెళ్లకపోయినా… సతీమణితో 2 వారాల పాటు వెళ్ళిన వెకేషన్ లో భాగంగా పనిలో పనిగా ఆరోగ్య సమస్యలను చక్కదిద్దుకున్నారని సమాచారం. మొత్తానికి చిరంజీవి ఆరోగ్యంగానే హైదరాబాద్ కు తిగిరి రావడం చూసి అభిమానుల మనసు కాస్త కుదుట పడింది.

comments on this point in bholaa shankar teaser

ఇక తదుపరి ఆగస్ట్ 11న రిలీజ్ కానున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ కు చిరంజీవి తిరగనున్నారు. ఆచార్య పెద్ద హిట్ ఇవ్వక పోయినా తరువాత వచ్చిన గడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. దీంతో భోళా శంకర్ కూడా మంచి హిట్ కానుందని చిరు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ALSO READ : విజయ్ సేతుపతి “విడుదలై-2” లో ఆ హీరోయిన్ కోసమే సీన్ మార్చారా? అసలు ప్లాన్ మారిందా!!

You may also like