బాబాయ్ ని చూసి ఆశ్చర్యపోతుంటా అంటూ మెగా ప్రిన్సెస్ కామెంట్స్!

బాబాయ్ ని చూసి ఆశ్చర్యపోతుంటా అంటూ మెగా ప్రిన్సెస్ కామెంట్స్!

by Anudeep

Ads

మెగా కుటుంబం నుంచి హీరోలే కాదు, హీరోయిన్ కూడా వ‌చ్చింది. మెగా ప్రిన్సెస్ గా తెరంగేట్రం చేసింది నిహారిక. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక‌. ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. హిట్ అందుకోలేకపోయింది. తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అవకాశాలు అందుకుంది. అక్కడ సక్సెస్ అవ్వలేకపోయింది. మెగా ఫామిలీ చిరు తరువాత అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్ ఆయన ఫాలోయింగ్ ఎలాంటిదో కొత్తగా చెప్పనవసరం లేదు.

Video Advertisement

ఆయన మాటలు,స్టైల్ కి ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.చిరు నాగ బాబు ఒక స్టైల్ అయితే పవన్ ది మరో స్టైల్ ఆయన సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని చెపుతూ ఉంటారు.గతం లో ఎందరో చెప్పారు కూడా, చిరు కూడా ఎన్నో ఇంటర్వ్యూ లలో చెప్పారు.ఇంట్లో నుంచి పారిపోవాలి అని అనుకున్నాడు అని ఎవరితోనూ సరిగ్గా ఒదిగిపోడు అని..పవర్ స్టార్ గురించి వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీ శ్రీరామ్ చెప్పుకొస్తూ షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ దొరికినా బుక్స్ చదువుతూ సమయాన్ని కేటాయిస్తారు అంటూ చెప్పారు…

లేటెస్ట్ గా మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఫాన్స్ తో చేసిన చిట్ చాట్ లో తన బాబాయ్ గురించి కూడా మాట్లాడింది “పవన్ బాబాయ్ ఎక్కువగా మాట్లాడడు. మితభాషి. ఎప్పుడూ కామ్‌గా ఏదో పుస్తకం చదువుతూ తన లోకంలో తనుంటాడు. అలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా…కొన్ని వేలమంది పాల్గొనే సభలు,వేదికల పై ఇచ్చే ప్రసంగాలు చూసి ఆశ్చర్య పోతు ఉంటాను అని అంటుంది. పవన్ చాలా వెరైటీ మనిషి అంటూ చెప్పింది. రాజకీయాల్లో పవన్ లాంటి మంచి మనుషులు చాలా అరుదుగా ఉంటారని అంటుంది.


End of Article

You may also like