Ads
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక విడాకులు తీసుకోబోతోందని చాలారోజుల నుండి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నిహారిక ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడి విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన నిహారిక అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో కూడా నిహారిక ఒంటరిగానే కనిపించింది. దీంతో మరోసారి విడాకుల రూమర్స్ వచ్చాయి.
Video Advertisement
కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న చైతన్య, నిహారిక ఇన్‌స్టాలో వారి పెళ్లి ఫోటోలు తొలగించడం, ఒకరినొకరు అన్‌ఫాలో అవడంతో విడాకులు పై ప్రచారాలు ఊపందుకున్నాయి. రీసెంట్ గా జరిగిన రామ్ చరణ్, ఉపాసనల పాప బారసాలకి కూడా చైతన్య హాజరుకాలేదు. నిహారిక ఒంటరిగానే కనిపించింది. ఇటీవల చైతన్య తన తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు. ఆ సమయంలో కూడా చైతన్య వెంట నిహారిక కనిపించలేదు. చైతన్య రీసెంట్ గా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ కూడా వైరల్ అయ్యింది. ఈ క్రమంలో నిహారిక విడాకుల పై జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. నిహారిక కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కోసం పిటిషన్ వేసింది. ఆ అప్లికేషన్ కు సంబంధించిన ఫోటో తాజాగా బయటకి వచ్చింది. ఆ అప్లికేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే కోర్టు గత నెల జూన్ 5న విడాకులు మంజూరు చేసిందని తెలుస్తోంది. ఈ వార్తతో గత కొంతకాలంగా వస్తున్న విడాకుల వార్తలకు తెర పడినట్టు అయ్యింది. 2020 డిసెంబర్లో మెగాడాటర్ నిహారిక వివాహం, మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కొడుకు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది. వీరి వివాహం రాజస్థాన్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలతో పాటు సిని ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కానీ పెళ్ళి అయిన తరువాత రెండు సంవత్సరాలకే చైతన్య, నిహారిక మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: ఏజెంట్ OTT రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతోంది..? కారణం ఇదేనా..?
End of Article