Ads
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో నిహారిక, చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిహారిక పెళ్లి రాజస్థాన్ ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది. అయితే కొద్ది రోజుల నుండి జంట విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరు ఆ వార్తలపై స్పందించింది లేదు.
Video Advertisement
అయితే తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకున్నారు అనే విషయం బయటికి వచ్చింది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ నీహరిక తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఎందుకు వీరు విడాకులు తీసుకున్నారు? వీరిద్దరిలో ఎవరు ముందు విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని నెటింట్లో ఆరా తీస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. జులై 4న అధికారికంగా తెలిసింది. వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో జూన్ 5న వీరికి డైవర్స్ ముంజూరు అయ్యాయి. విడాకులకు కారణం ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలే అని సమాచారం. అయితే విడాకుల కోసం ముందుగా పిటిషన్ వేసింది చైతన్య జొన్నలగడ్డనే అని కోర్టు రిలీజ్ చేసిన కాపీలో ఉంది.
పిటిషన్ ఏప్రిల్ 1న ఫైల్ అయ్యింది. ఆ తర్వాత విడాకులకు నిహారిక కూడా అంగీకరించగా, ఆమె తరఫున అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర పిటిషన్ దాఖలు చేశారట. కళ్యాణ్ నాగబాబుకు అత్యంత సన్నితంగా ఉంటారని సమాచారం ఇక విడాకుల మ్యాటర్ ను గోప్యంగా ఉంచాలని ముందే అనుకున్నారని తెలుస్తోంది. మే 19న మొదటి హియరింగ్, మే 29న రెండో హియరింగ్ జరిగినట్లు ఆ కాపీలో ఉంది.
మూడో హియరింగ్ జరిగిన జూన్5న తుది నిర్ణయం తీసుకున్నారు. అదే రోజే కోర్టు విడాకులు మంజూరు చేశారని కాపీలో ఉంది. నిహారిక విడాకుల విషయం బయటికి వచ్చిన తరువాత ఆమె చేసిన మొదటి పోస్ట్ తో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దానిపై చర్చలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె తన విడాకుల గురించి పోస్ట్ పెడుతుందని అందరు భావించారు.
కానీ ఆమె తన చిత్రాలకు, వెబ్ సిరీస్‌ల కోసం యూఎస్ నుండి ప్రమోషన్స్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌కు బర్త్ డే విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారు ఆమె విడాకుల విషయాన్న లైట్ తీసుకుందని అంటున్నారు. తాజాగా నీహరిక తన విడాకుల పై కూడా ఒక పోస్ట్ చేసింది.
అందులో ‘డైవర్స్ విషయంలో మేము ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, ఇది చాలా సెన్స్టివ్ విషయం. ఇద్దరం కొత్తగాప్రారంభించబోయే పర్సనల్ లైఫ్ లో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఈ ఇబ్బందికర సమయంలో నాకు మద్ధతుగా కుటుంబం, ఫ్రెండ్స్ నిలబడ్డారు. తమపై నెగటివ్‌గా మా పై ప్రచారం చేయవద్దని, ఇలాంటి టైంలో తమను ఇబ్బంది పెట్టవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని నిహారిక రాసుకొచ్చారు.
Also Read: లాభాలు మూటగట్టుకున్న ఏజెంట్ నిర్మాత..! ఏ సినిమా అంటే..?
End of Article