నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన వారందరికీ థాంక్స్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నిహారిక భర్త..

నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన వారందరికీ థాంక్స్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన నిహారిక భర్త..

by kavitha

Ads

మెగా డాటర్ నిహారిక ‘ఒక మనసు’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిహారిక ఈ మూవీకి ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టి పలు చిత్రాలలో నటించింది. కానీ ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేకపోయాయి.

Video Advertisement

నిహారిక లాక్ డౌన్ టైంలో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న సనగతి తెలిసిందే. నిహారిక పెళ్లి చాలా గ్రాండ్ గా  రాజస్థాన్ ప్యాలెస్ లో జరిగింది. పెళ్లి తరువాత ఈ జంట సంతోషంగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నీహరిక భర్త పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పెద్దల సమక్షంలో నిహారిక, చైతన్య జొన్నలగడ్డల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కానీ వీరిద్దరూ ప్రస్తుతం విడి విడిగా ఉంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో నిహారిక, చైతన్యలు ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు మొదలు అయ్యాయి. అంతేకాక మెగా కుటుంబంలో జరిగే  వేడుకల్లో చైతన్య లేకుండా నిహారిక మాత్రమే కనిపిస్తుండటం వల్ల ఈ జంట విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
రీసెంట్ గా జరిగిన నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ కి, అలాగే రామ్ చరణ్ ఉపాసనల పాప బారసాలలో కూడా చైతన్య లేకుండా నిహారిక ఒక్కరే హాజరు అయ్యారు. కానీ విడిపోతున్నారని వస్తున్న ప్రచారం పై  అటు నిహారిక, ఇటు చైతన్య ఎక్కడా స్పందించలేదు. ఈ క్రమంలో చైతన్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. విడాకుల వార్తల తరువాత అతను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం లేదు.
చైతన్య జొన్నలగడ్డ 4 నెలల అనంతరం ఒక మెడిటేషన్ సెంటర్ ఫోటోను షేర్ చేస్తూ,  ‘నన్ను ఇక్కడికి నడిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గత 10 రోజులుగా, విపాసన యోగా చేయడంతో నా లైఫ్ లో కాస్త ఉల్లాసంగా ఉందని, ఎక్కడికైనా మనం ఎటువంటి ఆలోచనలు లేకుండా వెళ్ళినపుడు జ్ఞానంతో బయటకు వస్తాం. ఈ చోటు కూడా అలాంటిదే’ అని చైతన్య రాసుకొచ్చాడు.

https://www.instagram.com/p/CuHTPhCS0YG/?utm_source=ig_embed&ig_rid=969820e4-36e0-40c9-9417-24bd09ccd27a

Also Read: ఇలాంటి వాటి మీద కూడా సినిమాలు తీస్తారా..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like