విడాకుల వార్త‌ల తరువాత మెగా డాటర్ నిహారిక లేటెస్ట్ ఫోటో షూట్.. వైర‌ల్ గా మారిన ఫోటోలు..

విడాకుల వార్త‌ల తరువాత మెగా డాటర్ నిహారిక లేటెస్ట్ ఫోటో షూట్.. వైర‌ల్ గా మారిన ఫోటోలు..

by kavitha

Ads

సినీ పరిశ్రమలో మూవీ రిలీజ్ వార్త‌ల కంటే కూడా డైవర్స్ సంబంధించిన వార్తలే ఎక్కువ‌గా వినపడుతున్నాయి. కొంత కాలం క్రితం నాగ‌చైత‌న్య‌, స‌మంతల విడాకుల గురించే వినిపించేవి. ఇక వారిద్దరూ విడాకులు తీసుకోవడమే కాకుండా ఎవ‌రి జీవితంలో వారు బిజీగా గడుపుతున్నారు.

Video Advertisement

ఆ తరువాత మెగా స్టార్ చిరంజవి కుమార్తె శ్రీజ, క‌ల్యాణ్ దేవ్ ల డైవర్స్ సంబంధించిన వార్తలు వైర‌ల్ గా మారాయి. వీరిద్దరు విడాకులు అయితే తీసుకోలేదు. కానీ దూరంగానే ఎవరికి వారు ఉంటున్నారు. చాలా రోజుల నుండే శ్రీజ, క‌ల్యాణ్ దేవ్ లు  దూరంగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి ఊతం ఇస్తూ ఇద్దరు సోష‌ల్ మీడియా ఖాతాలో ఇద్ద‌రూ ఉన్న ఫోటోల‌ను తొలగించారు.niharika-konidela-latest-photos-viral-5 ఇక ఇప్పుడు మెగాడాట‌ర్ నిహారిక కొణిదెల విడాకుల వార్త‌లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ వార్తలు రావడానికి కార‌ణాలు కూడా ఉన్నాయి. ఇటీవల నిహారిక త‌న ఇంస్టాగ్రామ్ ఖాతలో ఉన్న ఆమె భర్త  చైత‌న్య‌కు ఉన్న ఫోటోలు తొలగించింది. ఒక ఫోటోను, వీడియోను తొలగించకుండా ఉంచింది. ఇక చైతన్య కూడా తన సోషల్‌ మీడియా అకౌంట్ లోని వారి వివాహ ఫోటోలు అన్నింటిని తొలగించాడు. అంతే కాకుండా ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ  ఒకరి సోషల్ మీడియా ఖాతాలను ఇంకొకరు అన్‌ఫాలో కూడా చేశారు.
niharika-konidela-latest-photos-viral-4సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నీహారిక ఈ మధ్య కాలంలో సైలెంట్‌ గా ఉండడంతో విడాకుల ప్రచారాలు  ఎక్కువ అయ్యాయి. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు డైవర్స్ తీసుకోవడానికి ముందు సోషల్‌ మీడియాల్లో తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడం ద్వారా చెప్పకనే చెప్తున్నారు.
niharika-konidela-latest-photos-viral దానివల్ల కూడా నీహారిక-చైతన్య విడాకులు  తీసుకోబోతున్నారేమో అని మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా విడాకుల ప్రచారం అనంతరం నిహారిక తొలిసారి త‌న ఫోటోల‌ను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. నిహారిక  ఈ ఫోటోల‌లో లంగా వోణీలో సంప్రదాయ లుక్ లో మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. Also Read: ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చు పై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన కార్తికేయ.. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనగలమా?

https://www.instagram.com/p/CqSLz63J2Cv/?hl=en

 


End of Article

You may also like