ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చు పై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన కార్తికేయ.. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనగలమా?

ఆస్కార్ క్యాంపెయిన్‌ ఖర్చు పై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చిన కార్తికేయ.. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ మాటలను కొనగలమా?

by kavitha

Ads

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలోమాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ని కూడా ఉర్రూతలూగించింది. ఆస్కార్ నామినేషన్‌ లో స్థానం సంపాదించుకోవడమే పెద్ద విషయం అని భావిస్తే, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును అందుకుంది. దీనికి ముందుగా అంతర్జాతీయ అవార్డులు అయిన గోల్డెన్ గ్లోబ్ మరియు హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ వంటి పురస్కారాలను కూడా దక్కించుకుంది.

Video Advertisement

ఆస్కార్ రావడం పట్ల అందరు సంతోష పడుతుండగా, మరో వైపు కొంతమంది ఆస్కార్ క్యాంపెయిన్ చేయడం కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టిందని విమర్శిస్తున్నారు. సుమారు 80 కోట్లు ఖర్చు పెట్టిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా లైన్ ప్రొడ్యూసర్ అయిన కార్తికేయ ఈ విమర్శల పై స్పందించాడు. అలాగే ఆస్కార్ క్యాంపెయిన్‌ కి అయిన ఖర్చు గురించి క్లారిటీ ఇచ్చారు. ఆస్కార్ క్యాంపెయిన్ కోసం భారీగా ఖర్చు పెట్టారనే రూమర్ ఎందుకు వచ్చిందనేది అర్ధం కావట్లేదని అన్నారు. karthikeya-clarify-about-rrr-oscars-campaign-rumors1ఆడియెన్స్ కి మూవీ నచ్చడంతో ఆస్కార్ కోసం క్యాంపెయిన్ చేయాలని భావించామని, పబ్లిసిటీ బడ్జెట్‌ ప్రకారమే ఖర్చు చేసామని చెప్పారు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా బడ్జెట్ ప్రకారమే చేశామని, డబ్బులు పెట్టి ఆస్కార్ కొనుక్కోవడం అనేది పెద్ద జోక్ అని అన్నారు. 95 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థ అది. అందులో ప్రతి ఒక్కటి కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అలాగే ఫ్యాన్స్ ప్రేమను కొనలేము.
karthikeya-clarify-about-rrr-oscars-campaign-rumors-2ఈ చిత్రం గురించి జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ మాటలను కొనగలమా? సినిమాకు బాగా ప్రచారం చేసింది అభిమానులే అని కార్తికేయ చెప్పారు. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు ఆస్కార్ క్యాంపెయిన్ చేయడం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తారు. కానీ మాకు ఆ అవకాశం లేదు. మొదట క్యాంపెయిన్ చేయడం కోసం పెట్టాలనుకున్న బడ్జెట్ 5 కోట్లు. అయితే ఆ డబ్బు కూడా ఎక్కువే అనిపించింది. అందుకే ఆ బడ్జెట్ లో వీలైనంత ఖర్చు తగ్గించడానికే చూసాము.
karthikeya-clarify-about-rrr-oscars-campaign-rumors-3 ఆ డబ్బును కూడా 3 దశల్లో వెచ్చించాలనుకున్నాము. మొదట మూడు కోట్లు పెట్టాం. నామినేషన్స్‌ స్థానం పొందడంతో కొంచెం బడ్జెట్ ను పెంచాం. క్యాంపెయిన్‌కు మొత్తం ఐదారు కోట్లు ఖర్చు అవుతుందని భావించాము. ఫైనల్ గా రూ.8.5 కోట్లు ఖర్చు అయింది. ఎందుకంటే లాస్ ఏంజిల్స్‌, న్యూయార్క్ లలో ఎక్కువ స్క్రీనింగ్స్ లో మూవీ వేయాల్సి వచ్చిందని వివరించారు. ఇక రామ్ చరణ్,ఎన్టీఆర్, ప్రేమ్ రక్షిత్, కాలభైరవలు, రాహుల్ సిప్లిగంజ్ లను ఆస్కార్ కమిటీ వారు ఆహ్వానించారు. చంద్రబోస్‌, కీరవాణి బాబాయి ఇద్దరు నామినేషన్‌లో ఉన్నారు.
నామినేషన్‌లో ఉన్నవారికి,కమిటీ ఆహ్వానించిన వారు కాకుండా వెళ్ళినవారంతా కూడా ఆస్కార్ టికెట్లు కొనుగోలు చేయాలి. దాని కోసం నామినేషన్స్‌లో ఉన్న వ్యక్తులు ఆస్కార్ కమిటీకి వారికి ఈ-మెయిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ టికెట్లలో రక రకాల క్లాస్‌లు కూడా ఉంటాయి. కీరవాణి బాబాయ్ మా కుటుంబం కోసం ఆస్కార్ కమిటీకి ఈ-మెయిల్ పెట్టారు. తరువాత వారు లింక్ పంపించారు. karthikeya-clarify-about-rrr-oscars-campaign-rumors-4ఆ విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కో టికెట్ కి 1500 డాలర్లు చొప్పున కొనుకున్నాము. అదీ కూడా లోయర్ లెవల్. మరో నలుగురికి టాప్‌లో కూర్చొని చూడడానికి 750 డాలర్ల టికెట్లు కొనడం జరిగింది. ఈ మొత్తం ప్రాసెస్ కూడా అధికారికంగానే జరిగిందని కార్తికేయ వెల్లడించారు.

Also Read: “దసరా” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

 


End of Article

You may also like