ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక్క విషయం దసరా సినిమా. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ అంతకుముందు రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ గా చేశారు.
Video Advertisement
ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా మొత్తం గోదావరిఖనిలోని ఒక ప్రాంతంలో జరుగుతుంది. ఈ సినిమా కోసం సినిమా బృందం అంతా కూడా చాలా కష్టపడ్డారు అని చాలా ఇంటర్వ్యూలలో తెలిపారు. ట్రైలర్ చూస్తూ ఉంటే నిజంగా వారి కష్టం మనకి అర్థం అవుతోంది. సినిమా పాటలు కూడా ప్రేక్షకులకి చాలా బాగా నచ్చాయి.
సినిమా బృందం అంతా కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో, అలాగే హిందీలో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. దాంతో సినిమా బృందం అంతా కూడా కేవలం తెలుగు మీడియాకి మాత్రమే కాకుండా జాతీయ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా హీరో నాని అయితే భారతదేశంలో ఉన్న చాలా ప్రాంతాలలో ప్రమోషన్స్ చేసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉమైర్ సంధు ఈ విధంగా రాశారు. “దసరా ఫస్ట్ రివ్యూ. ఇది ఒక పైసా వసూల్ ఎంటర్టైనర్. నాని పాన్-ఇండియన్ హీరోగా తన ఆటని మొదలు పెట్టారు. సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యారు.”
“అవార్డ్ గెలుచుకునే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ కీర్తి సురేష్ చూడడానికి చాలా బాగున్నారు. యాక్షన్, ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. ఈ పుష్ప 2.0 వెర్షన్ ని కచ్చితంగా చూడండి” అని రాశారు. ఒక వేళ ఈ రివ్యూ నిజం అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చాలా మంది అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.