షూటింగ్ అవ్వకుండానే రిలీజ్ చేసేసారు…!

షూటింగ్ అవ్వకుండానే రిలీజ్ చేసేసారు…!

by Mounika Singaluri

Ads

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ మంచి ఫామ్ కొనసాగిస్తున్నారు. హ్యాపీ డేస్ సినిమా తోటి తెలుగు చిత్రంలోకి అడుగుపెట్టిన ఆయన తర్వాత వరుస పెట్టి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. జూనియర్ రవితేజ అని అభిమానులు పిలుచుకునే విధంగా తన నటనను మలుచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో వరుస పెట్టి ఫ్లాపులు వచ్చిన నిరాశ చెందకుండా మంచి మంచి సినిమాలు తీస్తూ వచ్చారు.

Video Advertisement

ఎవరి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్న హీరోల్లో నిఖిల్ ఒకరు.అయితే స్వామి రారా సినిమాలో తోటి ట్రాక్ లోకి వచ్చిన నిఖిల్ తర్వాత కార్తికేయ, సూర్య vs సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి హిట్ సినిమాల్లో నటించారు. తాజాగా అన్నికిల్ నటించిన కార్తికేయ2 చిత్రం పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ కొట్టింది. నిఖిల్ కు మంచి స్టార్ ఇమేజ్ ను తీసుకువచ్చింది.

అయితే నిఖిల్ తాజా చిత్రం పై మాత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేదు
ఈ విషయంపై నిఖిల్ స్పందిస్తూ పై చిత్రం గురించి మాట్లాడారు. స్పై చిత్రాన్ని 10 రోజులు షూటింగ్ ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ చేసేసి విడుదల చేశారని అసహనం వ్యక్తం చేశారు. అందుకే ఆ సినిమా పెద్దగా ఆడలేదని తన అభిప్రాయంగా వివరించారు. అయితే రానున్న సినిమాల్లో ఎలాంటి తప్పులు జరగకుండా ప్రేక్షకులను అలరిస్తానని హామీ ఇచ్చారు.

సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక రహస్యాలు అంటూ ఈ సినిమా గూడచారి కథతో రూపొందింది. ప్రస్తుతం కార్తికేయ3, స్వయంభు, ది ఇండియా హౌస్ చిత్రాలను ఎక్కడ రాజీ పడకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఖిల్ తెలిపారు. స్వయంభు చిత్రం కోసం నిఖిల్ మూడు నెలల పాటు వియత్నం లో శిక్షణ తీసుకున్నారు. ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు.

Also Read:“ఇలాంటి సీన్స్ ఎలా పెట్టారు..?” అంటూ… “చంద్రముఖి 2” మూవీ మీద కామెంట్స్..!


End of Article

You may also like