Ads
కర్ణాటక మాజీ సీఎం కొడుకు నిఖిల్ గౌడ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.లాక్ డౌన్ వేళ ఏ మాత్రం పెళ్లి వాయిదా వేసుకోటానికి మొగ్గుచూపలేదు.ఏప్రిల్ 17 వ తేదీ వివాహం తక్కువ మంది బంధుమిత్రుల మధ్య కర్ణాటక లోని రామ్ నగర్ లో జరిగింది.కరోనా వైరస్ మహమ్మారిగా మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.తద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Video Advertisement
లాక్ డౌన్ కారణంగా చాలా మంది తమ ఫంక్షన్స్ ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇటు టాలీవుడ్ లో కూడా హీరో నిఖిల్,నితిన్ తమ వెడ్డింగ్స్ ని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. కానీ హీరో,కర్ణాటక మాజీ సీఎం కొడుకు నిఖిల్ గౌడ మాత్రం తన వివాహాన్ని వాయిదా వేసుకోవటానికి ఏ మాత్రం ఇష్ట పడలేదు .ఏప్రిల్ 17వ తేదీన అతి తక్కువ మంది బంధువుల మధ్య రామ్ నగర్ లో వీరి వివాహం జరిగింది.
ఈ పెళ్లి లో వధూవరులు ఇద్దరు ఎంతో అందంగా ముస్తాబయ్యారు .ముఖ్యంగా చెప్పుకోవలసింది వధువు రేవతి గురించి.వీరి వివాహానికి సంబందించిన కొన్ని ఫోటోలు రేవతి,నిఖిల్ లు సోషల్ మీడియా లో షేర్ చేసారు. వధువు రేవతి ఎలా ఇంత చక్కగా ముస్తాబు అయిందో కూడా వివరించారు.
ఆమెకు మేకప్ చేసిన మహిళ పేరు గీతాంజలి అట.ఇప్పుడు వీళ్లకి సంబందించిన ఫోటోలు నెట్ లో వైరల్ గా మారాయి .
End of Article