Ads
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ‘కార్తికేయ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇదే జోష్ లో ఇటీవల ‘స్పై’ అనే మూవీతో ఆడియెన్స్ ను పలకరించాడు. ఈ సినిమాకి గ్యారీ బీ హెచ్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్యా మేనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
Video Advertisement
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. జులై 29న రిలీజ్ అయిన నిఖిల్ ‘స్పై’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లోనే రూ.28.90 కోట్లు కలెక్ట్ చేసి, నిఖిల్ కెరీర్ లో అతివేగంగా బ్రేక్ ఈవెన్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. నిఖిల్ తాజాగా ఒక లేఖను రిలీజ్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నిఖిల్ లేఖలో ‘స్పై మూవీకి నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను అందించారు. నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా మీద ఉన్న నమ్మకంతో ఎంతో మంది ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొన్నారు. దాంతో నా కెరీర్ లో నే అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం బాధగాను ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాలలో వచ్చిన ఇబ్బందుల కారణంగా స్పై సినిమాను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయలేకపోయాం.
ఆఖరికి ఓవర్సీస్లో సైతం 350 దాకా తెలుగు ప్రీమియర్ షోలు క్యాన్సల్ అయ్యాయి. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఆడియెన్స్ కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నాను. ఎందుకంటే కార్తికేయ-2 మూవీతో మీ అందరికీ చేరువయ్యాను. అయితే స్పై మూవీని అందించలేకపోయాను. తర్వాత రాబోయే నా మూడు చిత్రాలు అన్ని భాషల్లో థియేటర్లలో తప్పకుండా అనుకున్న టైమ్ కి విడుదల అవుతాయని మాటిస్తున్నాను.
నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలుగు ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి మాటిస్తున్నాను. ఇప్పటి నుండి మూవీ కంటెంట్, క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాను. నాపై ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను అందిస్తాను’ అని నిఖిల్ పేర్కొన్నాడు.
End of Article