రెండోసారి అనుకున్న ముహుర్తానికే నిఖిల్ పెళ్లి …ఎప్పుడు? ఎక్కడ అంటే?

రెండోసారి అనుకున్న ముహుర్తానికే నిఖిల్ పెళ్లి …ఎప్పుడు? ఎక్కడ అంటే?

by Anudeep

Ads

కళ్యాణం వచ్చినా , కక్కొచ్చినా ఆగదూ అంటారు..కరోనా వచ్చింది..కళ్యాణాలు అన్ని బంధ్..లేకపోయుంటే ఈ పాటికి ఎంతమంది ఒక ఇంటి వాళ్లయ్యేవారో.. ఎవరి సంగతో ఎందుకు కాని మన హీరోలు నిఖిల్,నితిన్ ల పెళ్లికి ఈ లాక్ డౌన్ అడ్డుపడుతూ వస్తుంది..పెట్టుకున్న ముహుర్తాలు క్యాన్సిల్ చేసుకున్నారు..మళ్లీ ముహుర్తాలు పెట్టారు..కానీ మళ్లీ లాక్ డౌన్ పొడిగించారు..ఈ సారి మాత్రం ఆపేది లేదంటూ..నిఖిల్ పెళ్లికి సిద్దపడిపోయాడు..ఇంతకీ పెళ్లెప్పుడు? ఎక్కడ??

Video Advertisement

హ్యాపీడేస్ తో పరిచయం అయిన నిఖిల్ తర్వాత వరుస చిత్రాలు చేస్తూ తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు..ఈ యంగ్ హీరో, డా.పల్లవి వర్మ అనే అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు..ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో నిశ్చితార్దం కూడా అయింది.అన్నీ బాగుంటే ఏప్రిల్ 16న పెళ్లి జరిగిపోయేదే, కాని లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.చేసేదేం లేక, మే 14కి నిఖిల్-పల్లవి పెళ్లిని వాయిదా వేశారు. కానీ మే 17వరకు లాక్ డౌన్ పొడిగించారు.

సరే , మే 17తర్వాత మంచి ముహుర్తాలేమైనా ఉన్నాయా అని చూసుకునేలోపే, మే 17 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగింపు ఉంటుందని ప్రకటించారు.  అయినా మే 14 దాటితే వచ్చేది మూఢం, ముహుర్తాలు కూడా ఉండవు.ఇద్దరి జాతకాల ప్రకారం మే 14 మంచి ముహుర్తం ఉండడంతో, ఆ రోజే చేయాలని పెద్దలు నిర్ణయించారు.ఎలాగూ 20మందితో పెళ్లి చేసుకోవచ్చని ముఖ్యమంత్రిగారు ప్రకటించారు, సో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మే 14 అనగా రేపు (గురువారం) నాడు నిఖిల్ పెళ్లి ఫిక్స్ చేశారు.హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో  ఓ ఫామ్‌ హౌజ్‌లో నిఖిల్‌ పెళ్లి జరగనుందని సమాచారం.

రేపటిలోపే పెళ్లికి ముందు జరగాల్సిన సంప్రదాయ కార్యక్రమాలు పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని చేయడం, గౌరీ పూజ ఇతరత్రా కార్యక్రమాలు  ఎవరిళ్లల్లో వాళ్లే నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం..మొత్తానికి నిఖిల్ పెళ్లికొడుకాయెనే…నెక్ట్స్ లైన్లో ఉన్నది నితిన్.. బాబు దుబాయ్లో ప్లాన్ చేసినట్టున్నాడు పెళ్లి..లాక్ డౌన్ తీసేవరకు ఆగుతాడో లేదంటే నిఖిల్ లా హడావిడిగా చేసేస్కుంటాడో ??


End of Article

You may also like