Ads
కార్తికేయ 2 మూవీ తర్వాత ఊహించని స్టార్ డమ్ వచ్చిన నటుడు నిఖిల్. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ తాజాగా స్పై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ను మాత్రం రాబట్ట లేకపోయింది.
Video Advertisement
భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. అటువంటి నేతాజీ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీ మెయిన్ కాన్సెప్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 29న విడుదల అయింది.
ఫస్ట్ డే కలెక్షన్స్ అదరగొట్టిన ఈ చిత్రం మొదటి మూడు రోజులు మంచి వసూళ్లను రాబట్టింది .కానీ ఎవరు ఊహించని విధంగా నాల్గవ రోజు నుంచి భారీ గా మూవీ కలెక్షన్స్ పడిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రం యొక్క థ్రెటికల్ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.. ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిపి 8 .02 కోట్ల షేర్ మరియు 14 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11.22 కోట్ల షేర్ మరియు 20 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఓవరాల్లో తీసుకుంటే ఈ చిత్రం సుమారు 5.28 కోట్ల నష్టం మిగిల్చింది. ఈ మూవీ కారణంగా డిస్ట్రిబ్యూటర్స్ కి హ్యూజ్ రెవెన్యూ లాస్ వచ్చింది అని చెప్పవచ్చు. స్టోరీ బాగున్నప్పటికీ సరిగ్గా తీయకపోవడమే ఈ మూవీ ఫెయిల్యూర్ కి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO READ : ప్రభాస్ “కల్కి 2889 AD” మూవీ స్టోరీ ఆ నవల నుంచే తీసుకున్నారా?
End of Article