కరోనా వలన ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది. మన దేశంలో ముందస్తుగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికి సరిపోయింది . లేదంటే పరిస్థితి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో కరోనాని కంట్రోల్ చేయగలిగింది కేవలం లాక్ డౌన్ మాత్రమే. ఈ నేపధ్యంలో ఎక్కడిక్కడ స్తంబించిపోవడంతో ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. దాంతో సినిరంగానికి చెందినవారు, ప్రముఖులు ముందుకు వచ్చిసాయం చేస్తున్నారు . నటి నిఖిలా విమల్ తన వంతుగా సాయం చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు.

Video Advertisement

ఇటీవల విడుదలైన దొంగ సినిమాలో కార్తీ సరసన నటించిన నిఖిలా విమల్ కేరళలోని  కన్నూర్ జిల్లాలోని కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు.  ప్రజలకు కావాల్సిన అవసరాలు కాల్ సెంటర్ కి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ప్రజలు చేస్తోన్న ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకుని వారికి కావాల్సిన మెడిసిన్స్, ఇతర నిత్యావసరాల జాబితాలను తయారు చేయడమే నిఖిల డ్యూటీ .అయితే కాల్ మాట్లాడేటప్పుడు తనేవరో చెప్పకుండా జాగ్రత్తపడుతుంది నిఖిల  .తెలుగులో ‘మేడ మీద అబ్బాయి’ అనే చిత్రంలో అల్లరి నరేష్ సరసన నటించిన ఈ మళయాళి కుట్టి, తర్వాత గాయిత్రి అనే మరో తెలుగు చిత్రంలో నటించారు .ఇక్కడ అంటే ఒకట్రెండు సినిమాలు చేసింది కాని మళయాళంలో వరుస సినిమాలతో అందరికి సుపరిచితమే .

‘‘పేదలకు సేవ చేయడానికి ప్రముఖ వ్యక్తులు ముందుకు రావాలని హెల్ప్ సెంటర్ నిర్వాహకులు ఆహ్వానించడంతో నేను స్వచ్ఛందంగా ఈ మిషన్‌లో చేరాను. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి కూడా ప్రజలు బయటికి రాకుండా మా వాలంటీర్లే డోర్ డెలివరీ చేస్తారు. ప్రజలు ఇళ్లలోనే ఉండేలా చేయడమే ఈ మిషన్ ముఖ్యోద్దేశం. ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని నిఖిలా చెప్పారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాళిపరాంబలోని తన ఇంటి నుంచి రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి హెల్ప్ సెంటర్‌కు చేరుకుంటున్నారు నిఖిలా.

దేశంలో కేరళ ప్రభుత్వం కరోనాతో పోరాడుతూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. ఇప్పటివరకు ప్రజలకు బియ్యం, పప్పులు , ఉప్పు, కారం ఇలా పదిహేడు రకాల వస్తువులను పంపిణి చేసింది . పనులు లేకుండా ఉన్న కార్మికులకు సుమారు 46లక్షలమందికి 5000రూ చొప్పున ఇచ్చింది. మరోవైపు మద్యాహ్న భోజనం, అంగన్వాడి ద్వారా ఇంటికే ఆహారాన్ని పంపిణి చేస్తుంది.అదే విధంగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఎక్కడిక్కడ కోవిడ్ -19 కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం..