Ads
ఆడుతూ పడుతూ చదువుకునే వయసులోనే ఆమె కు భరించలేని కష్టం వచ్చింది. ఎవరికీ చెప్పుకోలేక ఆమె ప్రాణం తీసుకుంది. చిన్న వయసులోనే తోడబుట్టిన సోదరుడు,సోదరి మరణించారు. కొన్ని రోజులకే తల్లి కూడా చనిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి పట్టించుకోవడం మానేసాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటూ పడరాని నిందలు పడుతూ జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఒకరోజు ఏమనుకుందో ఏమో ప్రాణం తీసేసుకుంది. కన్నీరు పెట్టిస్తున్న ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో చోటు చేసుకుంది.
Video Advertisement
సమయం కథనం ప్రకారం మంబాపూర్ గ్రామా నివాసి అనంతమ్మ కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు వున్నారు. వీరిలో వెంకటమ్మ అనే కూతురిని హన్మంతుకు ఇచ్చి పెళ్లి చేసింది. ఇతను జనగాం వాసి. అయితే, పెళ్లి తరువాత హనుమంతు మంబాపూర్ లోనే ఇల్లు కట్టుకుని గత పదహారు సంవత్సరాలు గా అక్కడే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు సంతానం ఉన్నారు. ఓ కొడుకు, ఓ కూతురు ఇంతకుముందే చనిపోయారు. భార్య కూడా అనారోగ్యం తో చనిపోవడం తో హనుమంతు మిగిలి ఉన్న ఒక్క కూతురుని అమ్మమ్మ దగ్గర వదిలేసి.. హైదరాబాద్ లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
representative image
అయితే, ఆ పాప పేరు రేణుక. ప్రస్తుతం తొమ్మిదవ తరగతి చదువుకుంటోంది. ఆమెను త్వరగా ఇంటినుంచి పంపేయడం కోసం పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. అయితే, ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినలేదు. చిన్న వయసులోనే నిందలు పడాల్సి వచ్చింది. అభం శుభం తెలియని వయసు లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక.. ఆమె తన తల్లి చీరతో ఉరి వేసుకుని చనిపోయింది. “నిందలు భరించలేక చనిపోతున్నా.. క్షమించు అమ్మమ్మా” అంటూ ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ లేఖ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
End of Article