పెళ్లికోసం అమెరికా నుండి ఇండియాకి వచ్చిన యువతి…ఎలా పరిచయమయ్యారంటే..?

పెళ్లికోసం అమెరికా నుండి ఇండియాకి వచ్చిన యువతి…ఎలా పరిచయమయ్యారంటే..?

by Anudeep

ప్రేమ ఒకే కులం, ఒకే ప్రాంతం, ఒకే దేశం చూసుకుని పుట్టదు . ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పలేం. హర్యానా  అబ్బాయి, మెక్సికన్ అమ్మాయిల మధ్య ప్రేమ పుట్టింది .ఆ ప్రేమ జంటని కరోనా కూడా వేరు చేయలేకపోయింది. అందుకే దేశాలు వేరైనా , ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉన్నా వారి పెళ్లి మాత్రం ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. ప్రేమ ఎలా మొదలైంది?పెళ్లి వరకు ఎలా వచ్చింది?ప్రస్తుత లాక్ డౌన్  పరిస్థితుల్లో వారి పెళ్లి ఎలా సాధ్యం అయింది..చదవండి.

Video Advertisement

హర్యానాలోని రోహతక్ కి చెందిన నిరంజన్ కశ్యప్ అనే అబ్బాయి, మెక్సికోకి చెందిన డానా ఇద్దరూ ఒక లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్లో పరిచయం అయ్యారు. పరిచయం ప్రేమగా మారింది. దాంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. నిరంజన్ ని పెళ్లి చేస్కోవడం కోసం డానా మెక్సికో నుండి ఫిబ్రవరి11 న ఇండియాకు వచ్చింది. డానా తో పాటు తన తల్లి కూడా వచ్చారు.

కోవిడ్ -19 వ్యాపిస్తున్న నేపధ్యంలో ఎవరికి ఏ ఆటంకం కలగకుండా పెళ్లి చేసుకోవాలని అనుకుని, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కోసం అప్లై చేశారు.రిజిస్ట్రార్ ఆఫిసర్ తో పాటు  అతికొద్ది మంది సమక్షంలో స్పెషల్ మారేజ్ యాక్ట్ చట్టం ప్రకారం ఇద్దరూ ఏప్రిల్ 13న ఒక్కటయ్యారు. హిందూ మారెజ్ యాక్ట్, ముస్లిం మారేజ్ యాక్ట్ మాదిరిగానే స్పెషల్ మారేజ్ యాక్ట్ ఇంటర్ క్యాస్ట్ , ఇంటర్ రిలేజియన్ మ్యారేజెస్ కి వర్తిస్తుంది. ప్రస్తుతం నిరంజన్, డనా కూడా ఈ చట్టం ప్రకారమే ఒక్కటయ్యారు.

ఇదిలా ఉండగా హర్యానాలో గ్రీన్ జోన్, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అని  మూడు జోన్లుగా ఏర్పరచి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ,ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని ప్రాంతాన్న గ్రీన్ జోన్ గా, తక్కువ సంఖ్యలో కేసెస్ ఉన్న దాన్ని ఆరెంజ్ జోన్ గా, ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్ గా కేటాయించింది. ప్రస్తుతం కరోనా కేసులు 198 ఉండగా , ఇంతవరకు ముగ్గురు మరణించారు . 29మంది రికవర్ అయ్యారు. మరికొద్ది రోజుల్లో అన్నింటిని గ్రోన్ జోన్స్ గా మార్చుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు హర్యానా సిఎం దుష్యంత్ చౌతాలా.


You may also like