నిర్భయ దోషులకు శిక్షపడటం వెనక కృషిచేసిన ముగ్గురు మహిళలు వీరే..! హ్యాట్సాఫ్ మేడం!

నిర్భయ దోషులకు శిక్షపడటం వెనక కృషిచేసిన ముగ్గురు మహిళలు వీరే..! హ్యాట్సాఫ్ మేడం!

by Anudeep

దేశ రాజధానిలో ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశం చేత కన్నీరు పెట్టించింది.  దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ రూపంలో ఉన్న  రాక్షసులకు శిక్ష పడాలని దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందరి కోరిక చివరికి మార్చి 20న తీరింది. ఆడపిల్లలందరికి న్యాయం జరిగిందని చెప్పలేం కాని నిర్భయకి న్యాయం జరిగింది. నిర్భయ ఆత్మకి శాంతి కలిగింది. కాని ఈ మృగాలను పట్టుకుంది, వారికి శిక్షపడేలా చేసింది, వారితో చివరి వరకు పోరాడింది ముగ్గురూ మహిళలే అని తెలుసా? వారే ఐపిఎస్ ఛాయా శర్మ, లాయర్ సీమా ఖుష్వా, నిర్బయ తల్లి ఆశాదేవి.

Video Advertisement

ఛాయా శర్మ  (ఐపిఎస్)

ఏడేళ్ల క్రితం తన శరీరం  ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లనను కూడా భయపడేలా ఉందంటే ఆ మృగాలు ఎంతగా గాయం చేశాయో అర్దం అవుతుంది. ఆ పాశవిక ఘటనని మళ్లీ తవ్వుకోవడం అనవసరం. కేవలం అత్యాచారానికి గురైన అమ్మాయి, హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది . పోలీసుల ముందున్న వివరాలు ఇవే . ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది. అసలు ఏం జరిగింది? ఎవరు తనని అత్యాచారం చేశారు. ఇవన్ని సమాధానం లేని ప్రశ్నలే .

అంత బాధలో కూడా స్థైర్యాన్ని కూడగట్టుకుని తనకు జరిగిన అన్యాయం గురించి, గుర్తున్నంత వరకు ప్రతి విషయాన్ని పోలీసులకు చెప్పింది. అది విన్న ఛాయా శర్మ ఎంక్వైరీ స్టార్ట్ చేసి కేవలం వారం రోజుల్లో ఆరుగురు నిందితుని పట్టుకుంది. వారిలో ఒకరు మైనర్, మరొకరు మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన నలుగురికి మొన్న ఉరి అమలు చేశారు.

కేవలం నిర్భయ మాటలే తనను కేసు ముందుకు తీసుకుపోయేలా నడిపాయని, చిన్న గాయం అయితేనే విలవిల్లాడుతామే , అలాంటిది అంతటి బాధని పంటిబిగువున పెట్టి వారికి ఎలా అయినా శిక్ష పడేలా చేయాలని నిర్భయ కోరిన కోరక ఇన్నేళ్లకు తీరిందని భావోగ్వేదానికి గురయ్యారు ఛాయా శర్మ. ఎటువంటి ప్రలోభాలకు తగ్గకుండా నేరస్థులను తప్పించుకోకుండా చూడడంలో ఛాయ శర్మ పాత్ర ఎనలేనిది.

సీమా ఖుష్వా (లాయర్):

ఉత్తర ప్రదేశ్ కి చెందిన సీమా ఖుష్వాహా అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్లో సభ్యురాలు. ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా ఇన్నేళ్ల పాటు ఈ కేసుని వాదించడమే కాదు, నిర్భయ తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నూరిపోయడంలో సీమా ఖుష్వా కృషి ఎనలేనిది.ఎఫ్ఐఆర్ నమోదు  దగ్గరనుండి ఛార్జిషీట్ చేయించడం వరకు సీమా ప్రధాన పాత్ర పోషించారు .

పటియాలా హౌస్ కోర్ట్  నుండి, ఢిల్లీ హైకోర్టు, తదనంతరం సుప్రీం కోర్టు వరకు నిర్భయ తరపున తన వాదనలు వినిపించారు.దోషులు ఎన్ని సార్లు శిక్ష నుండి తప్పించుకుంటూ వచ్చినా కృంగిపోకుండా ప్రతిసారి తన వాదనలు మరింత బలంగా వినిపించారు. ఎట్టకేలకు విజయం సాధించారు.

 

ఆశా దేవినిర్భయ తల్లి):

ఆడపిల్ల అత్యాచారానికి గురవడం వల్ల కుటుంబ పరువు పోతుందనుకునే సమాజం మనది. పోనీ తెగించి కేసు పెట్టిన న్యాయం జరిగిన కేసులు చాలా అంటే చాలా తక్కువ శాతం. అలాంటిది కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడడానికి సిధ్దపడింది ఆశాదేవి. ఏడేళ్లుగా పోరాటం చేసింది.

ఆలస్యం అయినా నా కూతురికి న్యాయం జరిగింది, ఇకముందు ఇలాంటి అన్యాయం ఎక్కడ జరిగినా తను పోరాడటానికి సిధ్దం అని ఉరి శిక్ష అమలు కాగానే ఆశాదేవి మాట్లాడిన మాటలు ఇవి. నిర్భయ ఘటన జరగడానికి ముందు తనొక మామూలు గృహిణి.

 

 


You may also like

Leave a Comment