Ads
చాలా సినిమాల్లో బామ్మ, అమ్మమ్మ పాత్రల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి నిర్మలమ్మ గారు. ఈమె అసలు పేరు రాజమణి.
Video Advertisement
ఆమెకి నాటకాలంటే ఎంతో ఇష్టం కానీ ఇంట్లోవాళ్లు అసలు ప్రోత్సహించ లేదు. కానీ నిర్మలమ్మకి పెదనాన్న సపోర్ట్ ఇవ్వడంతో సినిమాల్లోకి వచ్చారు. 1956లో పదహారేళ్ళ వయసులో గరుడ గర్వభంగం సినిమాలో మొదట నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది. ఈమె స్టార్ హీరోలైన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు మొదలైన వారితో కలిసి నటించారు.
ఎస్వీ కృష్ణారెడ్డి, ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో నిర్మలమ్మ గారు నటించారు. దాదాపు 50 సంవత్సరాల నటనా ప్రస్థానంలో, నిర్మలమ్మ గారు 700 పైగా సినిమాల్లో నటించారు. అలానే చిరంజీవి, వెంకటేష్ తదితర హీరోలకి బామ్మగా, అమ్మగా నటించి ఎంతో మంచి పేరు పొందారు. మయూరి, సీతారామరాజు సినిమాల్లో తన నటనకు గానూ నిర్మలమ్మ గారు నంది అవార్డు కూడా అందుకున్నారు.
నిర్మల ఆర్ట్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, ఆ నిర్మాణ సంస్థ ద్వారా ద్వారా చలాకీ మొగుడు చాదస్తపు పెళ్ళాం సినిమాని నిర్మించారు నిర్మలమ్మ గారు. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించగా, ఈ సినిమాకి దర్శకత్వం రేలంగి నరసింహారావు గారు దర్శకత్వం వహించారు. నిర్మలమ్మ చివరిగా ప్రేమకు స్వాగతం సినిమాలో నటించారు. ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. అయితే, ఎప్పుడు మనకి బామ్మగా కనిపించే ఈమె యుక్త వయసులో ఎలా ఉన్నారు అనేది మీకు తెలుసా..? ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫోటోలని ఓ లుక్ వేసేయండి.
End of Article