అసలు నిజాలు బయటపెట్టిన నిరుపమ్ భార్య మంజుల..! డాక్టర్ బాబు తో ఎందుకు కలిసి నటించటం లేదంటే.?

అసలు నిజాలు బయటపెట్టిన నిరుపమ్ భార్య మంజుల..! డాక్టర్ బాబు తో ఎందుకు కలిసి నటించటం లేదంటే.?

by Anudeep

Ads

2008 ఈటీవీ లో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా నటుడుగా పరిచయమయ్యారు నిరుపమ్ పరిటాల. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు, రచయిత మరియు సీరియల్స్ కి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఎన్నో సీరియల్ లో నటించి చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు నిరుపమ్.

Video Advertisement

నిరుపమ్ చంద్రముఖి, కలవారి కోడలు, కాంచనగంగ, కార్తీకదీపం, ప్రేమ, హిట్లర్ గారి పెళ్ళాం ఇలా అనేక సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఈయన భార్య మంజుల కూడా బుల్లితెర నటి అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. మంజుల మొదటిసారిగా చంద్రముఖి సీరియల్ ద్వారానే నటిగా పరిచయం అయ్యారు.

ఈ చంద్రముఖి సీరియల్ ద్వారా నిరుపమ్, మంజుల పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలో ఇరువురు వివాహ బంధంతో ఒకటయ్యారు. అనేక సీరియల్స్ లో ఇద్దరు నటించి బుల్లితెర ప్రేక్షకులను నటనతో ఆకట్టుకునేవారు.

మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ద్వారా  నిరుపమ్ డాక్టర్ బాబు క్యారెక్టర్ తో అనేకమంది అభిమానులు సంపాదించుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్న నిరూపమ్ తన భార్య మంజులతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే నెటిజన్లు తాజాగా యూట్యూబ్ ఛానల్ వేదికగా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.

అందులో ఒకటి డాక్టర్ బాబు తన భార్య మంజులతో కలిసి ఒకే సీరియల్ లో కనిపించకపోవడానికి గల కారణం ఏమిటి అని నెటిజన్లు ప్రశ్న అడిగారు.  నిరూపమ్ భార్య మంజుల ఈ ప్రశ్నకు సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఆ సమాధానం ఏమిటంటే ప్రస్తుతం మంజుల వయసు 36 సంవత్సరాలు. ఈ వయసులో తనకు సీరియల్స్ లో హీరోయిన్ పాత్రలు ఇచ్చే అవకాశం లేదు. నిరుపమ్ ప్రస్తుతం సీరియల్ లో హీరో క్యారెక్టర్ మాత్రమే చేస్తున్నారు. ఇందువలన ఆయన హీరో కాకుండా ఇతర పాత్రలు చెయ్యలేరు. ఈ కారణం వల్లే మేము ఇద్దరం ఒకే సీరియల్ లో  కలిసి నటించేలేక పోతున్నాము అనే విషయాన్ని వ్యక్తంచేశారు మంజుల.


End of Article

You may also like