Ads
ఏ చిత్రానికైనా కథ, కథనం, పాత్రలు ఎంత ముఖ్యమో అంతకంటే దర్శకత్వం చేసే డైరెక్టర్ సారథ్యం చాలా ముఖ్యం. అలాంటి డైరెక్టర్ వల్లే పొరపాటు జరిగితే దాని ప్రభావం కచ్చితంగా మూవీ కలెక్షన్స్ మీద పడుతుంది.
Video Advertisement
ఎవరా దర్శకుడు ? ఏమిటా తప్పిదం? తెలుసుకోవడానికి మరిన్ని వివరాల్లోకి వెళ్దాం.కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, అందాల రాక్షసి మొదలైన చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందారు హను రాఘవపూడి.
ఈమధ్య రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు కనువిందు చేయడానికి రానున్న సీతారామం సినిమా ప్రచార వేడుకల్లో పాల్గొన్న హను తను ఇంతకుముందు మూవీస్ లో జరిగిన పొరపాట్లు గురించి అతను చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.”పడి పడి లేచే మనసు” సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ కి జబ్బు ఉంది అన్న విషయం సస్పెన్స్ మెయింటైన్ చేయాలి అని ఆశించాను, కానీ ఆ కాన్సెప్ట్ కి ప్రేక్షకుల ఆదరణ అనుకున్నంతగా దక్కలేదు.
అలాగే నేను తీసిన” లై “సినిమాలో రెండు పెద్ద తప్పులు చేశాను దాని కారణంగా సినిమా సక్సెస్ పొందలేకపోయింది.
ఈ సినిమా కథను కేవలం హీరోకి విలన్ కి మధ్య జరిగే సంఘర్షణగా మాత్రమే రాయడం, తర్వాత కమర్షియల్ కాన్సెప్ట్ కోసం హీరోయిన్ మేఘ ఆకాష్ పాత్ర సృష్టించడం వల్ల కథ మెయిన్ కాన్సెప్ట్ నుంచి సైడ్ లైన్ అయింది.నితిన్ ,అర్జున్ లాంటి పవర్ఫుల్ స్టార్స్ నటించినప్పటికీ ఆ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ పొందలేకపోయింది.
End of Article