Ads
దాదాపు 20 సంవత్సరాల నుండి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో నితిన్. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా పరిచయం అయిన రచయిత వక్కంతం వంశీ. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్
- నటీనటులు : నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్.
- నిర్మాత : ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
- దర్శకత్వం : వక్కంతం వంశీ
- సంగీతం : హారిస్ జయరాజ్
- విడుదల తేదీ : డిసెంబర్ 8, 2023
స్టోరీ :
నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్. హీరో కావాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కుటుంబంలో అందరూ ప్రోత్సహిస్తూ ఉంటే తండ్రి మాత్రం నితిన్ కష్టాన్ని కామెడీ చేస్తూ ఉంటాడు. కానీ నితిన్ వీటిని పెద్దగా పట్టించుకోడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు లిఖిత (శ్రీలీల) నితిన్ జీవితంలోకి వస్తుంది. ఎట్టకేలకు హీరో అయిన నితిన్ కి ఒక ఊరి సమస్యల గురించి తెలుస్తుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? అసలు ఆ ఊరికి ఉన్న సమస్యలు ఏంటి? అవన్నీ హీరో పరిష్కరించాడా? అసలు రాజశేఖర్ ఎందుకు వచ్చారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ప్రతి సినిమాకి కొత్త కథ ఉండాలి అని ప్రేక్షకులు కోరుకోవట్లేదు. చూపించే విధానం కొత్తగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అప్పుడే సినిమా చూస్తున్నప్పుడు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ విషయానికి వస్తే ట్రైలర్ లో దాదాపు కథ అంతా అర్థం అవుతుంది. ఇది పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. ఇలాంటి కథ ఉన్న సినిమాలు మనం చాలా చూసాం.
టేకింగ్ బాగుంటే సినిమా కథ రొటీన్ గా ఉన్నా కూడా హిట్ అవుతుంది. ఈ సినిమా కథ సాధారణంగా ఉన్నా కూడా ఇందులో కామెడీ యాడ్ చేసి కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇది కొన్ని చోట్ల బాగానే వర్క్ అవుట్ అయినా కూడా కొన్ని చోట్ల అవ్వలేదు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న జోక్స్ అవన్నీ కూడా సినిమాలో వాడారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ ఈ సినిమాకి తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేశారు.
దాదాపు మూడు సంవత్సరాల క్రితం విడుదలైన భీష్మ సినిమాలో చాలా యాక్టివ్ గా నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాలో అంత యాక్టివ్ గా ఉన్నారు. తన పాత్ర వరకు తను బానే చేశారు. హీరోయిన్ శ్రీలీల పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పాటల్లో డాన్స్ బాగా చేశారు అంతే. మిగిలిన ముఖ్య పాత్రల్లో నటించే రావు రమేష్, హరితేజ, రోహిణి, సీనియర్ నటి అన్నపూర్ణ గారు వీరందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు.
ఇలాంటి పాత్రల్లో వాళ్ళు చాలా సార్లు నటించారు. ఇప్పుడు కూడా అలాగే నటించారు. విలన్ పాత్ర పోషించిన సుదేవ్ నాయర్ బానే నటించారు. కొంచెం సేపు అతిధి పాత్రలో నటించిన రాజశేఖర్ కూడా అలరించారు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు పర్లేదు. ఒకటి రెండు పాటలు చూడడానికి బాగున్నాయి. అయితే ఏదేమైనా కూడా హారిస్ జయరాజ్ మార్క్ మాత్రం కాస్త మిస్ అయ్యింది ఏమో అనిపిస్తుంది. హారిస్ జయరాజ్ తెలుగులో చేసిన సినిమాలు తక్కువ.
ఆ సినిమాలు కూడా మన తెలుగు మాస్ మసాలా ఎంటర్టైన్ సినిమాలు కావు. కాబట్టి అలాంటి సినిమా ఇప్పుడు చేశారు. మరి ఆయనకి ఇదంతా కొత్తగా ఉండడం వల్ల ఏమో కానీ కాస్త సింక్ అవ్వలేదు ఏమో అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత పెద్ద గొప్పగా ఏమీ లేదు. అలా వెళ్ళిపోతుంది అంతే. సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగానే నడుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా రొటీన్ గా వెళ్ళిపోతుంది. కొన్ని జోక్స్ అయితే ఏదో బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తాయి. వాటిని చూస్తే నవ్వు కూడా రాదు.
ప్లస్ పాయింట్స్ :
- నితిన్ నటన
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
- పాటలు చిత్రీకరించిన విధానం
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- సెకండ్ హాఫ్
- తెలిసిపోయే కథ
- రొటీన్ స్క్రీన్ ప్లే
- బలవంతంగా ఇరికించిన కామెడీ సీన్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
మరి ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా, సినిమా కథ రొటీన్ గా ఉన్నా పర్వాలేదు, కామెడీ అక్కడక్కడ ఉంటే చాలు, నితిన్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : PRABHAS SALAAR: ట్రైలర్ లోనే అనుకుంటే సినిమాలో లో కూడా అంతే అంటగా.? ఇదెక్కడి ట్విస్ట్ నీల్ మావా.?
End of Article