నితిన్ నటించిన “మాస్ట్రో”… హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

నితిన్ నటించిన “మాస్ట్రో”… హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

చిత్రం : మాస్ట్రో

Video Advertisement

నటీనటులు : నితిన్, నభా నటేష్, తమన్నా భాటియా, నరేష్, జిషు సేన్ గుప్తా, మంగ్లీ.

నిర్మాత : నికిత రెడ్డి, సుధాకర్ రెడ్డి

దర్శకత్వం : మేర్లపాక గాంధీ

సంగీతం : మహతి స్వర సాగర్

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021, (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

maestro review

మాస్ట్రో రివ్యూ :

కథ :

అరుణ్ (నితిన్) ఒక పియానిస్ట్. అరుణ్ కి 14 సంవత్సరాల వయసున్నప్పుడు క్రికెట్ బాల్ తలకి తగిలి ఆప్టిక్ నర్వ్ డామేజ్ అయ్యి చూపు కోల్పోతాడు. సోఫీ (నభా నటేష్) వాళ్ళ హోటల్ లో పియానో వాయిస్తూ ఉంటాడు. మోహన్ అనే ఒకప్పటి స్టార్ హీరో (నరేష్), తన రెండవ భార్య అయిన సిమ్రాన్ కి (తమన్నా), పెళ్లిరోజు కానుకగా అరుణ్ ని వాళ్ళ ఇంటికి వచ్చి పియానో వాయించమని అడుగుతాడు. అక్కడికి వెళ్ళిన అరుణ్ అనుకోకుండా ఒక మర్డర్ కేస్ లో చిక్కుకుంటాడు. అరుణ్ నిజంగానే ఆ మర్డర్ చూసాడా? అరుణ్ చెప్పేదంతా నిజమా? అబద్దమా? ఆ మర్డర్ గొడవ నుండి అరుణ్ ఎలా బయటికి వచ్చాడు? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

maestro review

విశ్లేషణ :

ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధున్ సినిమాకి రీమేక్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఒరిజినల్ సినిమా కాన్సెప్ట్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. కాకపోతే దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ మాత్రం మాస్ట్రో సినిమాలో కనిపిస్తుంది. అలాగే కథలో మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేశారు. అయినా కూడా కాన్సెప్ట్ అదే ఉండడంతో సినిమా అంతా ఉత్కంఠగా సాగుతుంది. నితిన్ తన పాత్రకి న్యాయం చేశారు.

maestro review

అలాగే మిగిలిన నటులు నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, మంగ్లీ, రచ్చ రవి, శ్రీముఖి కూడా తమ పాత్ర పరిధిలో బాగానే నటించారు. కానీ సినిమా చూసిన తర్వాత తమన్నా భాటియా పర్ఫార్మెన్స్ మాత్రం మనకి గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు తమన్నా అలాంటి పాత్ర అసలు చేయలేదు. ఇలా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నాని చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. మహతి స్వర సాగర్ పాటలు, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఇంకా సస్పెన్స్ యాడ్ చేశాయి. సినిమా చూసిన తర్వాత ఒకవేళ థియేటర్లలో విడుదల అయినా కూడా మంచి టాక్ వచ్చేదేమో అని అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ

సస్పెన్స్ నడిపించిన విధానం

నటీనటుల పెర్ఫార్మెన్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మేకింగ్ లో క్వాలిటీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా కొంచెం ల్యాగ్ కనిపించే సీన్లు

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ : ఒరిజినల్ హిందీ సినిమా చూసిన ప్రేక్షకుడిని కూడా మాస్ట్రో నిరాశపరచదు. చిన్న చిన్న మార్పులతో మాస్ట్రో ఒక డీసెంట్ రీమేక్ గా నిలిచింది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన అనుభూతిని ఇస్తుంది.


End of Article

You may also like