అన్నా అంటూ తనకు రాఖీ కట్టిన సింగర్‌ మంగ్లీకి హీరో నితిన్‌ ఏం గిఫ్ట్‌ ఇచ్చాడో తెలుసా?

అన్నా అంటూ తనకు రాఖీ కట్టిన సింగర్‌ మంగ్లీకి హీరో నితిన్‌ ఏం గిఫ్ట్‌ ఇచ్చాడో తెలుసా?

by Anudeep

Ads

నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎక్కడ చూసినా ఆడపడుచులు తమ అన్నకో తమ్ముడుకో తమ అనుబంధానికి నిదర్శనంగా రాఖీ కడతారు. ప్రతి ఇంట్లో జరిగే ఈ వేడుకలో కత్తేముంది అనుకుంటున్నారా…..

Video Advertisement

2002 లో రొమాంటిక్ మూవీ జయం తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కాలు మోపిన నితిన్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తో మంచి నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. కానీ చెక్, రంగ్ దే వంటి సినిమాలతో వరుస బాక్సాఫీస్ డిజాస్టర్స్ చూసిన నితిన్ మళ్లీ కోత సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు.ఈ క్రమంలో లో నితిన్ మంగ్లీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అతని రాబోయే చిత్రం మాచర్ల నియోజకవర్గం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మంగ్లీ అభ్యర్థన మేరకు హీరో నితిన్ రాను రాను అంటూనో చిన్నాడో పాటను పాడారు. ప్రస్తుతం ఆ వీడియో చాలా వైరల్ అయింది.

నితిన్ , కృతీశెట్టి తో జంటగా నటిస్తున్న చిత్రం​ ‘మాచర్ల నియోజకవర్గం’. దీనికి దర్శకత్వం ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వహిస్తున్నారు. ఈ చిత్రం రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మించబడుతుంది. ఈ నెల 12 న రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ చిత్రం ప్రమోషన్స్‌ జోరు పెంచుతూ చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది.

ఈ క్రమంలో లో రాఖీ పౌర్ణమి సందర్భంగా తన తో ముచ్చటించిన సింగర్‌ మంగ్లీ తో నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సినిమా గురించి ఏనో విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూ పూర్తి అయ్యాక సింగర్ మంగ్లి నితిన్ చేతికి రాఖీ కట్టింది. దీంతో హ్యాపీ ఫీలైన నితిన్ ఆమెకు అన్న హోదాలో ఒక మంచి గిఫ్ట్ ను అందించారు.


End of Article

You may also like