‘భీష్మ’ సినిమాతో సక్సెస్ సాధించి అసలే ఊపుమీద ఉన్న హీరో నితిన్. ఇటీవలే పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాడు ఇకపోతే తన తదుపరి సినిమా అట్లూరి వెంకీ దర్శకత్వం లో రాబోతుంది. టైటిల్ ‘రంగ్ దే.నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది.సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరిగింది కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది..కరోనా దెబ్బతో ఇప్పుడు షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్ పడ్డాయి.కానీ ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు పొక్కింది.ఈ సినిమా ఒక మలయాళ సినిమాకి ఆధారమని చెప్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ కి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టుగా తీస్తున్నారని టాక్…ఆ సినిమా మరేదో కాదు అదే ‘చార్లీ’

Video Advertisement

Image credits : Hero Nithin Facebook Page

ఇకపోతే ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు..దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.దుల్కర్ సల్మాన్ నటించిన ‘చార్లీ’ లో హీరో హీరోన్లు ఇద్దరు గాడంగా ప్రేమించుకుంటారు..కానీ తమ జీవితాలని ఫ్రీ గా గడపాలని నిర్ణయించుకున్న ఆ ఇద్దరు చివరికి ప్రేమని సైతం త్యాగం చేయటం సినిమాకి హైలైట్ గా ఉంటుంది.పెళ్లి జరిగితే తమ స్వేచ్చకీ భంగం కలుగుతుందని ఇద్దరు భావిస్తారు అయితే అస్సలు కథ ఇక్కడ నుంచే తెలుగు లో ప్రారంభం అవుతుంది..ప్రథమార్ధం దాకా ఈ పాయింట్ తీసుకొని ద్వితీయార్థం లో వాళ్ళు మళ్ళి ఎలా కలుస్తారు అనే విషయం హై లైట్ గా చేసి స్క్రిప్ట్ నడిపిస్తారట సొగం కాపీ సొగం సొంత కథ , అన్నమాట దాంతో ఇప్పుడు రంగ్ దే వాళ్లు కూడా రైట్స్ తీసుకోకపోయినా కేసు వేసే అవకాశాలు తక్కువ.

ఇలాంటి కథలతో గతంలో తెలుగులో ఎన్నో వచ్చాయి అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సిఉంది! ‘భీష్మ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నారు భీష్మ ,ఇప్పుడు ఈ సినిమా తదుపరి చంద్రశేఖర్ యేలేటి తో కూడా మొదలు పెట్టారు ..కీర్తి సురేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి ఈ సినిమా ని 2020 సమ్మర్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ ఇప్పుడు కరోనా వలన వచ్చిన లాక్ డౌన్ కారణంగా అది జరిగే పని అస్సలు కాదు.