“నివేతా పేతురాజ్” నటించిన ఈ సిరీస్ చూశారా ఎలా ఉందంటే

“నివేతా పేతురాజ్” నటించిన ఈ సిరీస్ చూశారా ఎలా ఉందంటే

by Harika

Ads

మెగాస్టార్ చిరంజీవి కూతురు, సుస్మిత కొణిదెల నిర్మాతగా మారి నిర్మించిన వెబ్ సిరీస్ పరువు. సుస్మిత కోణిదెలతో పాటు, సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ కూడా ఈ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరించారు. సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. జి ఫైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్లుగా అందుబాటులో ఉంది. ఒక్కొక్క ఎపిసోడ్ 30 నిమిషాలకు పైనే ఉంది. ఇంక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, పల్లవి అలియాస్ డాలి (నివేతా పేతురాజ్) పెద్దలని ఎదిరించి, తాను ప్రేమించిన సుధీర్ (నరేష్ అగస్త్య) ని పెళ్లి చేసుకుంటుంది.

Video Advertisement

nivetha pethuraj paruvu series review in telugu

దాంతో పల్లవిని తన ఇంట్లో వాళ్ళందరూ కూడా దూరంగా పెడతారు. పల్లవి పెద్దనాన్న చనిపోయారు అని తెలిసి ఆయనని చూడడానికి సొంత ఊరికి వెళ్తున్న సమయంలో, పల్లవి బావ చందు (సునీల్ కొమ్మిశెట్టి) పల్లవిని, సుధీర్ ని పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత సుధీర్ కి, చందుకి గొడవ అవ్వడంతో ఈ గొడవలో చందు చనిపోతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? చందు ప్రేయసి స్వాతి (ప్రణీత పట్నాయక్) ఈ విషయం తెలుసుకుందా? ఎమ్మెల్యే రామయ్య (నాగబాబు) ఎలాంటి చర్య తీసుకున్నాడు? వీళ్ళందరూ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి?

ఇవన్నీ తెలియాలి అంటే మీరు సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ లో ఒక సెన్సిటివ్ విషయాన్ని చూపించారు. ఇలాంటివి ఇప్పటి వరకు సిరీస్ ద్వారా చూపించలేదు. నటీనటులు అందరూ చాలా బాగా నటించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలిసిన కథ. అయినా కూడా టేకింగ్ పరంగా చాలా బాగుంది. సిరీస్ చూస్తున్నంత సేపు తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా బాగుంది.

ఎమోషనల్ సీన్స్ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేవి అనిపిస్తుంది. కానీ మొత్తంగా చూస్తే మాత్రం హైలైట్ అయిన విషయాలు కూడా ఈ సిరీస్ లో బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి స-స్పె-న్స్ సిరీస్ ఇష్టపడేవారు ఈ సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి. సిరీస్ మొత్తంలో ఒకచోట కూడా బోర్ కొట్టించదు. స్క్రీన్ ప్లే బాగుంది. తెలుగులో వచ్చిన మంచి వెబ్ సిరీస్ లో పరువు కూడా ఒకటిగా నిలుస్తుంది.


End of Article

You may also like