“మేకప్ లేకుంటే ఇలా ఉంటారా.?” అని ట్రోల్ చేసారు…”నివేత థామస్” హైలైట్ కౌంటర్..!

“మేకప్ లేకుంటే ఇలా ఉంటారా.?” అని ట్రోల్ చేసారు…”నివేత థామస్” హైలైట్ కౌంటర్..!

by Anudeep

Ads

సెలెబ్రిటీలు ఏమి చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే.. వారి పై ఎప్పుడు జనాల ఫోకస్ ఉంటుంది కాబట్టి. సాధారణం గా హీరోయిన్లు తెరపై చాలా అందం గా కనిపిస్తారు. అందం గా కనిపించడం కోసం.. వారు ప్రత్యేకం గా శ్రద్ధ తీసుకుంటారు. మేక్ అప్ వేసుకుంటారు. మేక్ అప్ లో ఉన్న మాయే అలాంటిది.. నలభై ఏళ్ల వాళ్ళని కూడా.. పదహారేళ్ళ పడచువాళ్ళలా కనిపించేలా చేయగలదు..

Video Advertisement

nivetha thamos
అయితే.. హీరోయిన్స్ మేక్ అప్ వేసుకోకుండా ఉంటె ఎలా ఉంటారో అన్న సందేహాలు కూడా చాలా మందికే ఉంటాయి. ఈ ఫోటోలు కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. అయితే.. ఒక్కోసారి కొంతమంది కామెంట్ లు చేస్తూ ఉంటారు. వీరు మేక్ అప్ లు వేసుకోకపోతే అందం గానే ఉండరు అంటూ ఉంటారు.

అందం అనేది మనసుకి సంబంధించినది అన్న సంగతి అందరికి తెలిసిందే. కానీ.. వీళ్ళు పైకి కనబడే అందం గురించే మాట్లాడతారు. దీనితో.. కొన్నిసార్లు సెలెబ్రెటీలకు కూడా చిర్రెత్తుకొస్తు ఉంటుంది. తాజాగా.. ఇంటర్నెట్ లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. హీరోయిన్స్ మేక్ అప్ లేని ఫోటోలను జత చేసి.. వీళ్ళు మేక్ అప్ లేకపోతె ఇలా ఉంటారా..? అంటూ కామెంట్ ను పెట్టారు. దీనిని నివేత థామస్ పంచుకున్నారు.. “అవును అండి.. మీకు ఏమైనా ప్రాబ్లెమ్ హా?” అంటూ ఆమె స్టేటస్ ను పెట్టారు. ప్రస్తుతం ఈ స్టేటస్ వైరల్ అవుతోంది. అందం అంటే కేవలం బాహ్యం మాత్రమే కాదని.. మనసుకి సంబంధించింది అని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


End of Article

You may also like