గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమమ్ హీరో..! ఇలా అయిపోయారేంటి..?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమమ్ హీరో..! ఇలా అయిపోయారేంటి..?

by Harika

Ads

మలయాళం సినిమా హీరోలకి తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. కొంత కాలం నుండి మలయాళం సినిమాలని తెలుగు వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తున్నారు. తెలుగు వాళ్ళు మాత్రమే కాదు. మలయాళం సినిమాకి గత కొంత కాలం నుండి భారతదేశం అంతటా ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. కొన్ని సినిమాలు భారతదేశ ప్రేక్షకులని మలయాళ సినిమా ఇండస్ట్రీ వైపు చూసే లాగా చేశాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ప్రేమమ్. ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. కానీ మలయాళం లోనే ఈ సినిమా చాలా మంది చూశారు. 2015 లో ఈ సినిమా వచ్చింది. ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివిన్ పౌలీ, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ నటించారు.

Video Advertisement

రాజేష్ మురుగేశన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో చాలా మంది కొత్త వాళ్లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాతో హీరో నివిన్ పౌలీ మలయాళం లో స్టార్ హీరో అయిపోయారు. మలయాళం హీరోల స్క్రిప్ట్ సెలక్షన్ సాధారణంగానే డిఫరెంట్ గా ఉంటుంది. నివిన్ పౌలీ స్క్రిప్ సెలక్షన్ కూడా అలాగే ఉంటుంది. సినిమాకి, సినిమాకి అసలు పోలిక లేకుండా ఉండేలాగా స్క్రిప్ట్ లని తీసుకుంటారు. సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకుంటారు. అందుకే నివిన్ పౌలీ నటనకి ఇంత మంది అభిమానులు ఉన్నారు.

అయితే ఇటీవల నివిన్ పౌలీ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక ఈవెంట్ కి వెళ్లారు. అందులో నివిన్ పౌలీ పూర్తిగా మారిపోయి కనిపిస్తున్నారు. బరువు పెరిగినట్టు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. కొంత మంది ఇది సినిమా కోసం అని అంటున్నారు. మరి కొంత మంది మాత్రం నివిన్ పౌలీకి థైరాయిడ్ ఉంది అని, అందుకే ఇలా మార్పు వచ్చింది అని అంటున్నారు. కానీ వీడియో చూశాక మాత్రం గుర్తు పట్టడానికి కాస్త కష్టంగా అనిపించింది. పరిశీలించి చూస్తే కానీ అక్కడ ఉన్న నటుడు నివిన్ పౌలీ అని తెలియలేదు. సాధారణంగా సినిమా కోసం నివిన్ పౌలీ తనని తాను మార్చుకున్నారు. గతంలో ఇలా చాలా సార్లు చేశారు. మరి ఇప్పుడు కూడా అలాగే చేశారా? లేదా నిజంగానే థైరాయిడ్ ఉందా? ఈ విషయం మాత్రం ఇంకా తెలియదు.


End of Article

You may also like