శ్రీమంతుడు నుండి అన్ని సినిమాల్లో అంతే…కానీ “గుంటూరు కారం”లో అది లేనందుకు ఫాన్స్ హ్యాపీ.!

శ్రీమంతుడు నుండి అన్ని సినిమాల్లో అంతే…కానీ “గుంటూరు కారం”లో అది లేనందుకు ఫాన్స్ హ్యాపీ.!

by Harika

Ads

గుంటూరు కారం సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు మహేష్ బాబు. ఈ పోటీలో వెంకటేష్, నాగార్జున సినిమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా మహేష్ బాబు సినిమా మీదే ఫోకస్ పెట్టారు ప్రేక్షకులు. అయితే సినిమా రిజల్ట్స్ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో మహేష్ బాబు రూటు మార్చారంటూ కొందరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆ రూట్ ఏమిటంటే మహేష్ బాబు చాలా సినిమాలలో ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాడు.

Video Advertisement

శ్రీమంతుడు సినిమా దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా ద్వారా పుట్టిన ఊరు కోసం ఏమైనా చేయాలి అనే మెసేజ్ ఇచ్చాడు. బ్రహ్మోత్సవం సినిమా ద్వారా ఉమ్మడి కుటుంబంలో ఉండే కష్టసుఖాల గురించి మెసేజ్ ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన స్పైడర్ పక్కనపెడితే భరత్ అనే నేను సినిమా రాజకీయాల గురించి ఆలోచించే విధంగా మెసేజ్ ఇచ్చాడు. అలాగే ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేయాలి అనే మెసేజ్ మహర్షి సినిమా ద్వారా ఇచ్చాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల కోసం సాటి జవాన్లు పడే తపన చూపించాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో బ్యాంకింగ్ రంగంలో జరిగే అవకతవకల గురించి అందరూ ఆలోచించేలా చేశాడు. అయితే ఇందులో కొన్ని సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తే కొన్ని సినిమాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

guntur kaaram movie review

అయితే రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఏం సందేశం ఇస్తాడో అనుకున్నారు ఫాన్స్ కానీ గుంటూరు కారం సినిమాలో అలాంటి మెసేజ్ లు ఏవి లేకపోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు. బాబు రూటు మార్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేవు అంటూ సెటైరికల్ జోక్స్ వేస్తున్నారు.

Also Read: GUNTUR KAARAM REVIEW : “మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like