GUNTUR KAARAM REVIEW : “మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

GUNTUR KAARAM REVIEW : “మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్” కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. ఎన్నో సంవత్సరాల నుండి అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అర్ధరాత్రి మొదటి షో పడింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : గుంటూరు కారం
  • నటీనటులు : మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి.
  • నిర్మాత : ఎస్. రాధా కృష్ణ(చినబాబు)
  • దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
  • సంగీతం : తమన్ ఎస్
  • విడుదల తేదీ : జనవరి 12, 2024

స్టోరీ :

వైరా వెంకటరమణ (మహేష్ బాబు) గుంటూరులో మిర్చి యార్డ్ నడుపుతూ ఉంటాడు. రమణ తల్లి వైరా వసుంధర (రమ్యకృష్ణ), తండ్రి రాయల్ సత్యం (జయరాం) రమణ చిన్నప్పుడే విడిపోతారు. రమణ గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరి రావు) దగ్గర పెరుగుతాడు. వసుంధర మరొక పెళ్లి చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) రాజకీయాల్లో గొప్ప స్థానంలో ఉంటాడు.

వసుంధర రాజకీయ జీవితానికి మొదటి పెళ్లి, రమణ అడ్డంకిగా మారకూడదు అనుకుని రమణతో ఒక సంతకం పెట్టించాలి అనుకుంటాడు. వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. వెంకటస్వామి రమణతో ఆ సంతకం పెట్టించాడా? వసుంధర రమణకి దూరం అవ్వడానికి కారణం ఏంటి? వసుంధర ప్రేమని రమణ పొందాడా? రమణ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

guntur kaaram movie review

రివ్యూ :

త్రివిక్రమ్ ని అభిమానులు సరదాగా గురూజీ, మాటల మాంత్రికుడు అని అంటూ ఉంటారు. త్రివిక్రమ్ సినిమా స్టోరీలు సింపుల్ గా ఉంటాయి. అసలు కొన్ని పాత సినిమాలు చూసి, వాటి కథలని రీసైకిల్ చేసి సినిమాలు తీస్తారు అనే ఒక మార్క్ కూడా ఉంది. కానీ అన్ని చేసినా కూడా త్రివిక్రమ్ సినిమాలు అంటే ఏదో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా పెద్దగా కొత్తగా ఏమీ అనిపించదు. త్రివిక్రమ్ సినిమాలు రిపీట్ లో చూసిన ఎవరికి అయినా సరే త్రివిక్రమ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అర్థం అయిపోతుంది.

guntur kaaram movie review

ఇది మాత్రమే కాదు. సన్నాఫ్ సత్యమూర్తి నుండి త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలు అన్నీ కూడా ఒకటే టెంప్లేట్ మీద సాగుతాయి. హీరోలు మారడం వల్ల త్రివిక్రమ్ టేకింగ్ మారింది. దాని వల్ల సినిమాలో రిజల్ట్ మారింది. అంతే. త్రివిక్రమ్ కథనంలో మాత్రం పెద్దగా తేడా ఏమీ లేదు. ఒక సినిమాకి యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే, ఇంకొక సినిమాకి కామెడీ. మరొక సినిమాకి సెంటిమెంట్. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, అస్సలు బాలేదా అంటే, అలా చెప్పలేం. పోనీ చాలా బాగుందా అంటే, అలా కూడా చెప్పలేం. కొన్ని చోట్ల నిరాశపరిచినా కూడా, కొన్ని చోట్ల మాత్రం అలరిస్తుంది.

guntur kaaram movie review

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఉన్నాయి. కానీ మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ వల్ల అయ్యుండొచ్చు. వీరి నుండి చాలా ఎక్కువగా ఆశించాం. ఆ అంచనాలని మాత్రం అందుకోలేదు. చాలా సింపుల్ గా ఉంది. లేచి వచ్చేయాలి అన్నంత ఇబ్బంది పెట్టే సినిమా కాదు. కానీ హై ఇచ్చే ఎలివేషన్స్ తక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో పెద్ద హీరో సినిమా అంటే హీరో నిల్చుంటే ఎలివేషన్, హీరో కూర్చుంటే ఎలివేషన్ అనేలాగా ఉంటున్నాయి. ఈ సినిమా మాత్రం అలా లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే త్రివిక్రమ్ మహేష్ బాబుని అతడు సినిమాలో ఒకరకంగా ప్రజెంట్ చేశారు.

guntur kaaram movie review

ఖలేజా సినిమాలో ఇంకొక రకంగా ప్రజెంట్ చేశారు. ఇప్పటికి కూడా మహేష్ బాబు బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఖలేజా సినిమా నిలుస్తుంది అంటే ఆ సినిమాలో మహేష్ బాబు పాత్ర రూపొందించిన విధానం ఎంత బాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. అంత పెద్ద స్టార్ అయ్యాక కూడా మొహమాటం లేకుండా ఈ సినిమా కోసం ఆయన చేసిన కొన్ని సీన్స్ మాత్రం అభినందించాల్సిన విషయం.

guntur kaaram movie review

డాన్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించారు. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా మొత్తాన్ని తన భుజం మీద మోసారు. నిజంగా ఒక కొత్త మహేష్ బాబుని చూసినట్టే అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ పాత్రకి తక్కువ, స్పెషల్ అప్పియరెన్స్ కి ఎక్కువ అనే పాత్రలో నటించారు. శ్రీలీల కూడా పర్వాలేదు. కానీ డాన్స్ తో పాటు యాక్టింగ్ విషయంలో కూడా శ్రీలీల ఇంకా శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. రమ్యకృష్ణ తన పాత్ర పరిధి మేరకు చేశారు.

guntur kaaram movie review

ప్రకాష్ రాజ్ కూడా ఉన్నంతలో బాగానే చేశారు. రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, ఈశ్వరి రావు, జయరాం, జగపతి బాబు, సునీల్ వీళ్ళందరూ కూడా తమ పాత్రకి తగ్గట్టు చేశారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. త్రివిక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కలర్ గ్రేడింగ్ అంతా కూడా కాస్త ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయానికి వస్తే ఇంకా శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఒకటి, రెండు పాటలు బాగానే ఉంటాయి.

guntur kaaram movie review

కానీ ఈ మధ్య తమన్ పాటలు అన్నీ కూడా ఒకటే రకంగా అనిపిస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియా రెఫరెన్సెస్ బాగానే ఉన్నా కూడా, కొన్ని మాత్రం ఎందుకు వాడారు అర్థం కాదు. ఈ సినిమాలో పాటలు చిత్రీకరించిన విధానం బాగుంది కాబట్టి తెరపై చూడడానికి బాగున్నాయి. యాక్షన్ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. అంతా బాగానే ఉన్నా కూడా త్రివిక్రమ్ మార్క్ మాత్రం మిస్ అయ్యింది ఏమో అనిపిస్తుంది. మరి ఇది త్రివిక్రమ్ చేసిన ప్రయోగం కూడా అయ్యి ఉండొచ్చు. ఎలివేషన్స్ పక్కన పెట్టి, హీరోని సింపుల్ గా చూపించే ప్రయత్నం చేశారు. రైటింగ్ విషయంలో మాత్రం త్రివిక్రమ్ ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • మహేష్ బాబు
  • నిర్మాణ విలువలు
  • కొన్ని ఎమోషనల్ సీన్స్
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • సరిగ్గా వాడని కొన్ని పాత్రలు

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, పెద్ద హీరో సినిమాలో ఎక్కువ ఎలివేషన్స్ ఉంటాయి అని అనుకోకుండా, సరదాగా అలా సాగిపోయే ఒక సినిమా చూద్దాం అనుకునే వారికి గుంటూరు కారం సినిమా ఒక మంచి డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like