Ads
సినిమా ఇండస్ట్రీ …ఇది బయటకి కనిపించే రంగుల ప్రపంచం..లోపల దీని గురించి తెలుసుకోవలసినది ఎంతో ఉంది..అవును ఎందుకంటే ఇదే సినీ పరిశ్రమను నమ్ముకొని కొన్ని లక్షల మంది ఉన్నారు..వారందరికీ ఇదే జీవనోఉపాధి.కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టి వేయడంతో ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం అయ్యారు..లాక్ డౌన్ కారణంగా ఎటు వంటి పనులు నడవడం లేదు..
Video Advertisement
పెద్ద,చిన్న అంటూ తేడా లేకుండా అన్ని వర్గాలను ఇది కుదిపేసింది.సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎంతో మందికి పని జరిగితేనే పూట గడుస్తుంది. ఇప్పుడు వారి పరిస్థితి దారుణంగా ఉంది.ఇల్లు గడవాలన్నా…జీవనం సాగించాలన్నా డబ్బులు లేవు..ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడం వలన తన ఇల్లు గడవాలని రోడ్ల మీద బండి మీద పండ్లు అమ్ముకుంటున్నారు బాలీవుడ్ కి చెందిన నటుడు సోలంకి దివాకర్ .
దీనికి సంభందించిన పిక్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీం గర్ల్ సినిమాలో సోలంకి దివాకర్ నటించారు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సోలంకి దివాకర్ గతంలో పళ్ళ వ్యాపారం చేసేవారట..అందుకే ప్రస్తుతం ఎలాంటి షూటింగ్స్ లేకపోవడం తో మళ్ళీ తాను చేసిన పనినే నమ్ముకున్నారు అంట.ఇప్పటికి అయితే మళ్ళీ ఎప్పుడు షూటింగ్స్ మొదలవుతాయి అన్నది చెప్పలేమని..అంతవరకు తన ఇల్లు గడవడం కష్టమని తెలిపారు.
సోలంకి దివాకర్ లాంటి వెలుగులోకి వచ్చిన ఘటన ఒకటే కాదు…మనకు కంటికి కనపడని ఇలాంటి కళాకారులు ఎందరో ఉన్నారు,ఉంటారు కూడా..కేవలం ఒక్క సినీ పరిశ్రమే కాదు ఈ మహమ్మారి వలన యావత్ లోకం …అన్ని పరిశ్రమలకు ఇది దెబ్బ తీసింది..పని చేసుకుంటేనే ఇలాంటి వారికి పూట గడుస్తుంది..ఇలాంటి వారిని ఆదుకోవడానికి సినీ పరిశ్రమలోని పెద్దలు ముందుకి రావాలని అంటున్నటున్నారు..పలువురు ప్రముఖులు.
బాలీవడ్ లోనే కాదు ఇటీవల మన టాలీవుడ్ లో బుల్లి తెర జబర్దస్త్ నటుడు జీవన్ షూటింగ్స్ లేకపోవడం వలన తాను నమ్ముకున్న వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ఒక వీడియో ఇటీవలే సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.మొత్తానికి ఇలాంటి సంక్షోభం నుంచి ఎప్పుడు బయటపడుతామో చూడాలి..దీనికి సంబంధించి ప్రభుత్వాలు వీరిని ఆదుకోవడానికి ముందుకు రావాలి..హోప్ బెస్ట్ విల్ కం సూన్
End of Article