జీవితం లో మనం అందరం ఏదో వృత్తి చేసుకుంటూ బ్రతకవలసిందే…వ్యాపారమో..ఉద్యోగమో.ఎవరికైనా కష్టపడితేనే మూడు పూటలా తిండి..ప్రస్తుతం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని చుట్టేసింది..దాని వలన లాక్ డౌన్ ని పాటిన్చాల్సి వస్తుంది..కరోనా మహమ్మారి వలన యావత్ ప్రపంచం చిన్న బిన్నం అయ్యింది అటు సెలెబ్రెటీలు నుంచి సాయమాన్యుల వరకు ప్రతి ఒక్కరు దీని వలన సమస్యలని ఎదురుకుంటున్నారు.అటు సినీ పరిశ్రమను..నమ్ముకొని ఎందరో లక్షల్లో జీవనోపాధి సాగిస్తున్నారు.

Video Advertisement

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని రద్దు కావడం తో అటు టెక్నీషన్స్ ,అందులో నటించే క్యాస్ట్ వరకు సమస్యలని ఎదురుకుంటున్నారు..జీతాలు లేక ఇబ్బంది పడుతున్నవారెందరో..కొందరైతే ఏకంగా తోపుడు బండ్ల మీద పళ్ళు అమ్ముతున్నారు,మరి కొందరు అయితే చిత్ర పరిశ్రమకు ముందు ఎక్క్కడనుంచి వచ్చారో తిరిగి అదే పనులు చేసుకుంటున్నారు..తాజాగా మరో నటుడికి ఇలాంటి కష్టాలే వచ్చాయి.జీతాలు లేక చేతిలో ఉన్న డబ్బంతా అయిపోయి చివరికి సొంత వాహనాన్ని అమ్మేసుకున్నారు.


ఈ ఘటన బాలీవుడ్ కి చెందిన బుల్లితెర నటుడికి ఎదురయ్యింది ఆయన పేరు మానస్‌ షా హిందీలో ‘హమారీ దేవ్‌రాణీ’, ‘సంకట్‌మోచన్‌ మహాబలి హనుమాన్’వంటి ఫేమస్ సీరియల్స్ లో నటించారు..మా నాన్న ఒక రిటైర్ ఉద్యోగి.నా కుటుంబం మొత్తం నా మీదే ఆధార పడిఉంది..నేను నా జీవితం లో చాలా కష్ట కాలాన్ని ఎదురుకుంటున్నాను.ఇప్పుడు గత ఏడాది మే 5 నుంచి నవంబర్ 5 వరకు ఒక షూటింగ్ చేశాను..దీనికి సంబంధించి కొంత వరకే నాకు డబ్బుని ఇచ్చారు..సెప్టెంబర్ లో ఇస్తామని నవంబర్ లోఇచ్చారు..ఆ తరువాత ఇంకా మిగతా డబ్బుని ఇవ్వలేదు ఇప్పుడు నేను నా నివాసాన్ని వదిలి నా కజిన్ ఇంటికి వెళుతున్నాను చేతిలో డబ్బు లేక కారును అమ్ముకుంటున్నాను అని చెప్పాడు