బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ విజయం తరువాత జక్కన్న రాజమౌళి చేస్తున్న సినిమా ‘RRR పాన్ ఇండియా సినిమా గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా..ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.రామ రాజు గా రామ్ చరణ్-కొమరం భీం గా తారక్ ఈ సినిమాలో కనిపించనున్నారు.ఇప్పటీకే చరణ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన రామ్ చరణ్ లుక్ చూసి ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని చేరాయి.ఇకపోతే తారక్ పుట్టిన రోజుకి కూడా ఎన్టీఆర్ లుక్ రాబోతుందని అందరూ అనుకున్నారు.

Video Advertisement

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడటం.బయటకు ఎక్కడికి వెళ్లలేని స్థితి అంటూ ఇటీవలే రాజమౌళి పలు ఇంటర్వ్యూ లలో చెప్పారు..ఇప్పుడు అదే విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ టీం ఆఫిషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ పోస్ట్ చేసారు..తారక్ లుక్ కోసం మరి కొన్ని రోజులు ఆగక తప్పదు మరి…