ఎన్టీఆర్ 30 పై మరొక లీక్..! టైటిల్ అదేనా . .?

ఎన్టీఆర్ 30 పై మరొక లీక్..! టైటిల్ అదేనా . .?

by Anudeep

Ads

“ఆర్ ఆర్ ఆర్” సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుండి సినిమా ఎలా ఉండబోతోంది, ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తున్న తారక్ సెట్స్ పైకి మాత్రం ఇంకా వెళ్ళలేదు. దీంతో అభిమానులు తారక్ మూవీ ముచ్చట్ల కోసం ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

అయితే కొరటాల డైరక్షన్‌లో వస్తున్న ఎన్టీఆర్ 30 కి సంబంధించిన ఒక ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈసినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కొరటాల `ఆ ఒక్కటి అడక్కు` అనే టైటిల్‌ను ఖరారు చేశారట. క‌థకు స‌రిగ్గా ఆ టైటిల్ స‌రిపోతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారని సమాచారం.

NTR 30 tiltle leacked..

మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. దీనికి రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు ముందు అనుకున్నకథను పక్కకు పెట్టి.. పూర్తిగా కొత్త కథతో ముందుకుపోతున్నారట. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌కు కాస్తా ఆలస్యం అవుతోందని అంటున్నారు. అన్ని కుదిరితే ఈ సినిమా నవంబర్ నుంచి షూట్ ఉండోచ్చని అంటున్నారు.

NTR 30 tiltle leacked..

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా బరువు తగ్గారు.  తన పాత్ర కోసం కొత్త లుక్‌తో అదరగొట్టనున్నాడు.ఇక మరోవైపు ఇంకా సినిమా కోసం హీరోయిన్ ను కూడా ఖరారు చేయాల్సి ఉంది. యువసుధ ఆర్ట్స్ పతాకంపై పై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు సమాచారం.


End of Article

You may also like