NTR: ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో రేటింగ్ మరీ ఇలా వస్తోందా?

NTR: ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో రేటింగ్ మరీ ఇలా వస్తోందా?

by Anudeep

జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మరి ఈ షో కి రేటింగ్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం..

Video Advertisement

ntr

బిగ్ బాస్ వీక్ డేస్ యావరేజ్ గా వచ్చే రేటింగ్ కంటే తారక్ షో కి రేటింగ్ ఎక్కువే వస్తోందట. బిగ్ బాస్ రెండో వారం వీక్ డేస్ రేటింగ్ 6.18 గా ఉంది. మరో వైపు వీకెండ్ లో మాత్రం 9.96 రేటింగ్ వచ్చింది. అయితే.. బిగ్ బాస్ స్టార్ మా లో ప్రసారం అవుతుంది.. మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరుడు షో అయితే జెమినీ లో ప్రసారం అవుతుంది. ఈ ఛానల్ కు రీచ్ తక్కువ గా ఉండడం వల్లే రేటింగ్ కూడా అనుకున్నదానికంటే తక్కువ వస్తోంది అంటూ సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తోంది.


You may also like