“ఎన్టీఆర్-బుచ్చిబాబు” సినిమా స్టోరీ ఇదేనా..? ఆ తమిళ్ సినిమా రీమేక్ లాగా ఉందేంటి..?

“ఎన్టీఆర్-బుచ్చిబాబు” సినిమా స్టోరీ ఇదేనా..? ఆ తమిళ్ సినిమా రీమేక్ లాగా ఉందేంటి..?

by Anudeep

Ads

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది . తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రం తెరకెక్కనుంది. మరోవైపు ఉప్పెన సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఎన్టీఆర్ తదుపరి సినిమా చేయనున్నట్లు సమాచారం.

Video Advertisement

దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ దీనికి సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

NTR new movie story line resembles that tamil movie
తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. క్రీడా నేపథ్యంలో రానున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. పల్లెటూరి నేపథ్యంలో కబడ్డీ క్రీడాకారుడిగా ఒక పాత్రలో, అరవై అయిదేళ్ల వ్యక్తిగా మరొక పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు భోగట్టా. దీంతో ఎన్టీఆర్ అభిమానులు డైలమాలో పడ్డారు. ఈ స్టోరీ లైన్ చూస్తుంటే గతంలో తమిళ్ లో హీరో విజయ్ నటించిన సినిమాకు రీమేక్ లా ఉందే అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అదే నిజమైతే ఈ సినిమా నిజంగా రీమేక్ ఏనా లేదంటే వేరేనా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తమిళ్ హీరో విజయ్ నటించిన అన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రీమేక్ సినిమాకు ఎలా ఓకే చెప్పారన్నది అభిమానుల సందేహం. అభిమానుల్లో ఈ సందేహాలు తీరాలంటే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్ కు, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్ట్ చేసేందుకు ఓకే చెప్పారు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తయ్యే వరకు దర్శకుడు బుచ్చిబాబు సానా వేచిఉండాల్సిందే. ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఈ చిత్రం స్టార్ట్ అవ్వడానికి ఇంకో ఏడాది పట్టేలానే ఉంది. ఉప్పెన విజయం తర్వాత బుచ్చిబాబు సానా నుంచి కొత్త సినిమా అప్డేట్ లేదు.


End of Article

You may also like