Ads
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం 2022 జనవరి 7వ తేదీన రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అంతా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమా అన్ని ప్రాంతాలవారికి దగ్గర అవ్వాలని ప్రతి రాష్ట్రంలో కూడా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్ లో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాల్గొన్నారు. ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో భాగంగా వేదికపై రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, సల్మాన్ ఖాన్ ఇలా అందరూ కూడా సినిమా గురించి సినిమా షూటింగ్ లో వాళ్లు గడిపిన క్షణాలు గురించి గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
మొదటిగా రామ్ చరణ్ కి స్పెషల్ థాంక్స్ అంటూ మేము మంచి స్నేహితులమని ఎన్టీఆర్ చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలానే మా స్నేహం ఉండాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ అన్నారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ కంట నీరు పెట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
End of Article