Ads
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తన నటనలతోటి డాన్సులతోటి తాతకి తగ్గ మనవడు అని అనిపించుకున్నారు.
Video Advertisement
ఎన్టీఆర్ కేవలం సినిమా ఇండస్ట్రీకి పరిమితమకుండా తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించేవారు. 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం కూడా చేశారు. తర్వాత ఏమైందో ఏమో గాని తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు.
అసలు ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న విభేదాలు కల కారణం ఏంటో అభిమానులకి అర్థం కాక చూస్తున్నారు. ఇటీవల నందమూరి కుటుంబం కలిసి పాల్గొన్న ఫ్యామిలీ ఫంక్షన్ లో కూడా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ని అవమాన పరిచిన సంగతి తెలిసింది. అందరినీ పలకరించిన బాలయ్య ఎన్టీఆర్ ను పలకరించకుండా వెళ్ళిపోయారు.
దీంతో ఎన్టీఆర్ కి నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయన్న విషయం అర్థమైంది. అప్పట్లో ఎన్టీఆర్ ని అవమానించడం పట్ల ఆయన అభిమానులు నందమూరి కుటుంబం పైన తెలుగుదేశం పార్టీ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అసలు ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న విభేదాలకు గల కారణం ఇది అంటూ ఎన్టీఆర్ కి సన్నిహితుడు, తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ తెలిపారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్రతి చోటా టిడిపి ఓడిపోయింది అంటూ ఆర్టికల్ రాయించారని, ఎన్టీఆర్ ప్రచారం చేయడం వల్లే పార్టీ ఓడిపోయింది అన్నట్టు ప్రచారం చేయడం వల్ల ఎన్టీఆర్ తీవ్రంగా మనస్థాపం చెందారని అన్నారు.
తర్వాత 2014 ఎన్నికల్లో కనీసం ఎన్టీఆర్ తో మాట్లాడటం గాని ప్రచారానికి పిలవడం గాని చేయలేదని తెలియజేశారు. చంద్రబాబు కావాలనే ఎన్టీఆర్ ని దూరం పెట్టినట్లు వల్లభనేని వంశీ తెలిపారు. ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే నారా లోకేష్ కి భవిష్యత్తు ఉండదు అనే కారణంతోటి ఎన్టీఆర్ ని దూరంపెట్టారు అనేది కూడా బయట ప్రచారంలో ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టయి జైల్లో ఉన్న ఎన్టీఆర్ స్పందించకపోవడానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.
watch video :
ALSO READ : చంద్రయాన్ ని జనసేన పార్టీతో పొలుస్తూ “కేతంరెడ్డి వినోద్ రెడ్డి” కామెంట్స్..! ఏం అన్నారంటే..?
End of Article