ఎన్టీఆర్ vs రామ్ చరణ్: చదువు, ఆస్తుల వివరాల గురించి ఈ 15 విషయాలు మీకు తెలుసా.?

ఎన్టీఆర్ vs రామ్ చరణ్: చదువు, ఆస్తుల వివరాల గురించి ఈ 15 విషయాలు మీకు తెలుసా.?

by Sunku Sravan

Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో రికార్డును తిరగరాశారు ఎన్టీఆర్ రామ్ చరణ్. ఇద్దరు హీరోల మధ్య చాలా రోజుల నుంచి మంచి స్నేహం ఉంది. ఈ తరుణంలో వారి మైత్రి బంధాన్ని ఆర్ఆర్ఆర్ లో అద్భుతంగా చూపించారు రాజమౌళి. దీంతో అభిమానులంతా ఆనందంతో ఎగిరి గంతేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొందరలోనే వెయ్యి కోట్ల మార్కు కూడా దాటబోతోంది.

Video Advertisement

ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గురించే వైరల్ అవుతోంది. ఇందులో ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం, ఆస్తులు, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు, అభిమానులు వంటి విషయాల గురించి చర్చలు సాగుతున్నాయి. కానీ వీటి గురించి తెలుసుకోవాలని ఎంతో మంది అభిమానులకు ఆసక్తిగా ఉంటుంది. మరి వీరి లైఫ్ స్టైల్ గురించి ఈ 15 విషయాలు ఏంటో చూద్దాం..!

1)ఖరీదైన కార్లు : తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలకు కార్లు అంటే చాలా ఇష్టం. మార్కెట్లోకి న్యూ మోడల్ ఎప్పుడు వచ్చినా ముందుగా కొనుగోలు చేసేది వీరే.

2)ఇక కార్ల విషయంలో ఎన్టీఆర్ మరి స్పీడ్ గా ఉంటారు. కొత్తగా ఏ మోడల్ వచ్చిన తారక్ గ్యారేజ్ లోకి వెళ్లాల్సిందే. గత సంవత్సరం యంగ్ టైగర్ లంబోర్గిని యూరుస్ గ్రాఫైట్ అనే మోడల్ కార్ ను ఆర్డర్ చేసేసారు. అంతేకాకుండా మన దేశంలోనే ఈ కారును ముందుగా కొన్న వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడని చెప్పవచ్చు. దీని రేటు 3.16కోట్ల రూపాయలు. ఆయన దగ్గర రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, జిఎల్ఎఫ్ 350డి, అలాగే పోర్షే 718 కేమ్యాన్. ఇందులో ఎక్కువగా ఎన్టీఆర్ ఉపయోగించే కారు బీఎండబ్ల్యూ ఎల్ డి. దీని ధర చూస్తే 1.32 కోట్ల రూపాయలు. దీన్ని స్వయంగా ఎన్టీఆర్ గారు నడుపుతుంటారు.

3)రామ్ చరణ్ : హీరో ఆస్టన్ మార్టిన్ వన్ టేజ్ అనే కారును వాడతారు. దీన్ని చిరంజీవి రామ్ చరణ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతోపాటుగా రామ్ చరణ్ వద్ద మెర్సిడెస్ బెంజ్, జి ఎల్ ఎస్ 350 డి ఉంది. దీని ధర 80 లక్షల రూపాయలు. అలాగే చరణ్ యొక్క గ్యారేజ్ లో 3.34 కోట్ల రూపాయల విలువ గల రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూడా ఉన్నాయి.

4) అలాగే ఎన్టీఆర్ కు 80 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉందని సమాచారం. దీన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసి ఉంచుతారట.

5)రామ్ చరణ్ కు స్వయంగా ట్రూ జెట్ పేరుతో సొంత ఎయిర్లైన్ కంపెనీ కూడా ఉంది.

6)అలాగే వీరికి విలాసవంతమైన భవనాలు, చిరంజీవి,రామ్ చరణ్, ఎన్టీఆర్ పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తూ ఉంటారు.

7)జూనియర్ ఎన్టీఆర్ కు జూబ్లీహిల్స్ తో చాలా విలువైన విలాసవంతమైన భవనం కూడా ఉంది.

8) అలాగే యంగ్ టైగర్ కు బెంగళూరు, కర్నాటకలలో కూడా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి.

9)హైదరాబాద్ జూబ్లీహిల్స్ రాం చరణ్ ఈ మధ్యనే 30 కోట్ల రూపాయలు పెట్టి కొత్త ఇల్లు కూడా కోనుకున్నారట.

10)యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ దాదాపుగా నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఉంటుందని అంచనా.

11)రామ్ చరణ్ ఆస్తులు చూసుకుంటే దాదాపు పదమూడు వందల కోట్లు ఉంటుందని అంచనా.

12)ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎన్టీఆర్ గుంటూరు సమీపంలోని విజ్ఞాన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

13)రామ్ చరణ్ విషయానికి వస్తే హైదరాబాదులోని సెయింట్ మేరీస్ కళాశాల నుంచి బీకాం పూర్తి చేశారు.

14)ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్నటువంటి కామన్ పాయింట్ చూస్తే. రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు మంచి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

15)వీరిద్దరికీ బైక్స్ అంటే కూడా చాలా ఇష్టం అని తెలుస్తోంది. కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాలవల్ల మెయింటైన్ చేయలేకపోతున్నారు. అయితే రామ్ చరణ్ కు మాత్రం రెండు గుర్రాలు కూడా ఉన్నాయట. ఇక పారితోషికం విషయంలో ఇద్దరూ సమానమే. ఇందులో ఎన్టీఆర్ యాడ్స్ రూపంలో ఎక్కువ సంపాదిస్తారు అని తెలుస్తోంది.


End of Article

You may also like