Ads
తెలుగు ప్రేక్షకులకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Video Advertisement
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఎన్టీఆర్ అదే ఊపుతో కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పటికీ సినిమాకు సంబంధించి దాదాపు 30% షూటింగ్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించారు.
దేవర సినిమా నుంచి ఇప్పటికే హీరో ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ కపూర్ లకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయగా ఆ పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు తారక్ ఫ్యాన్స్. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు.
ఈ మూవీ షూటింగ్ అయిపోగానే ఎన్టీఆర్ ప్రశాంతి నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే ప్రశాంత్- ఎన్టీఆర్ ఫ్యామిలీ సమయంలో సరదాగా లక్ష్మి ప్రణతిని ఆటపట్టించారట. నువ్వు కూడా ఎన్టీఆర్ మూవీలో రోల్ చేయు గుర్తుంటుంది. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతారు అని ప్రశాంత్ నీల్ సజెస్ట్ చేశారట. లక్ష్మీ ప్రణతి మాత్రం దానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. తనకు అసలు యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదని చెప్పిందట.
ఎన్టీఆర్ పక్కన జస్ట్ నిలబడు అంతకు మించి యాక్టింగ్ అవసరం లేదని ప్రశాంత్ నీల్ ఫోర్స్ చేశారట. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఇంతలో ఎన్టీఆర్ సైలెంట్ గా అక్కడికి వచ్చి ప్రణతికి అలాంటివి ఇష్టం ఉండదు ఆమెను ఇబ్బంది పెట్టడం వేస్ట్ అంటూ కాస్త ఘాటుగా డైరెక్టర్ పై సీరియస్ అయినట్టుగా ఆన్సర్ ఇచ్చారట. దాంతో ఆ టాపిక్ ను అంతటితో వదిలేయడంతో పాటు ఆ విషయం గురించి మరొకసారి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావన తీసుకురాలేదట.
End of Article