Home News జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికలు ఏకగ్రీవం..!

జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికలు ఏకగ్రీవం..!

by Anudeep

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (JIC) ఎన్నికలు నిర్వహించగా NTV చైర్మన్ నరేంద్ర చౌదరి ప్యానెల్ ఏకగ్రీవం అయింది. JIC ఎన్నికలలో నరేంద్ర చౌదరి ప్యానెల్ కు ఎదురు లేదు. ఈ ఎన్నికల్లో సివి రావు ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవి కి ఎ. హిమ బిందు ఎన్నికయ్యారు. కార్యదర్శి గా టి.హనుమంతరావు ఎన్నికవగా, సంయుక్త కార్యదర్శిగా ఎం.జనార్దన్ రెడ్డి ని ఎంపిక చేశారు.

JIC 1

పాలకమండలి సభ్యులుగా అమిత్ రెడ్డి, అశోక్ రావు, తిరుపతిరావు, శివప్రసాద్, రమేష్ చౌదరి, వెంకట సోమరాజు, కిలారు రాజేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, జగ్గారావు, సుభాష్, మరియు రవీంద్రనాథ్ లను ఎంపిక చేసారు. కొత్తగా ఎన్నికయిన ఈ పాలక మండలి రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ఈ నెల 19 వ తేదీన కొత్తగా ఎంపిక చేయబడ్డ కార్యవర్గం తొలిసారిగా భేటీ కానుంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికలలో NTV చైర్మన్ నరేంద్ర చౌదరి ప్యానెల్ కు తిరుగులేదని మరోసారి ఋజువైంది.

JIC 3

You may also like