హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (JIC) ఎన్నికలు నిర్వహించగా NTV చైర్మన్ నరేంద్ర చౌదరి ప్యానెల్ ఏకగ్రీవం అయింది. JIC ఎన్నికలలో నరేంద్ర చౌదరి ప్యానెల్ కు ఎదురు లేదు. ఈ ఎన్నికల్లో సివి రావు ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవి కి ఎ. హిమ బిందు ఎన్నికయ్యారు. కార్యదర్శి గా టి.హనుమంతరావు ఎన్నికవగా, సంయుక్త కార్యదర్శిగా ఎం.జనార్దన్ రెడ్డి ని ఎంపిక చేశారు.

JIC 1

పాలకమండలి సభ్యులుగా అమిత్ రెడ్డి, అశోక్ రావు, తిరుపతిరావు, శివప్రసాద్, రమేష్ చౌదరి, వెంకట సోమరాజు, కిలారు రాజేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, జగ్గారావు, సుభాష్, మరియు రవీంద్రనాథ్ లను ఎంపిక చేసారు. కొత్తగా ఎన్నికయిన ఈ పాలక మండలి రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ఈ నెల 19 వ తేదీన కొత్తగా ఎంపిక చేయబడ్డ కార్యవర్గం తొలిసారిగా భేటీ కానుంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికలలో NTV చైర్మన్ నరేంద్ర చౌదరి ప్యానెల్ కు తిరుగులేదని మరోసారి ఋజువైంది.

JIC 3