“ఇంకోసారి ఇలా కాళ్ళు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకు..” అంటూ ఆసియా కామెంట్స్..! అసలేం జరిగిందంటే?

“ఇంకోసారి ఇలా కాళ్ళు పట్టుకునే పరిస్థితి తెచ్చుకోకు..” అంటూ ఆసియా కామెంట్స్..! అసలేం జరిగిందంటే?

by Anudeep

Ads

పటాస్ షో తో చాలా మంది ఆర్టిస్టులకు మంచి పేరు లభించింది. నూకరాజు, ఆసియా, ఫైమా వంటి ఆర్టిస్టులు కూడా బాగా పాపులర్ అయ్యి ఫ్యాన్స్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పటాస్ షో ఆగిపోవడంతో వీరు తలా దిక్కూ అయ్యారు. ఇక, నూకరాజు – ఆసియా, ఫైమా – ప్రవీణ్ ల మధ్య పటాస్ షో నుంచే స్నేహ బంధం ఉంది. వారు ప్రేమలో ఉన్నారేమో అన్న అనుమానాలు కూడా ప్రేక్షకులకు లేకపోలేదు.

Video Advertisement

అయితే.. ఆసియా – నూకరాజు రిలేషన్ గురించిన వార్తలు మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో వీరి రిలేషన్ గురించి బయటకు వచ్చింది.

nookaraju 1

ఈ షోలో ఆసియా, నూకరాజు, శాంతి కుమార్‌ లు ఓ స్కిట్ ను ప్రదర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రేమ పెళ్లిళ్లు, పరువు హత్యల నేపథ్యంలో ఈ స్కిట్ సాగుతుంది. అందరు వారి స్కిట్ ను మెచ్చుకున్నారు. రామ్ ప్రసాద్ అయితే.. ఏకంగా నిజమైన ప్రేమికుల్లా నటించారు అని అనగా.. వెంటనే “ఆది” అందుకుని నిజమైన ప్రేమికుల్లా ఏంటి..? నిజమైన ప్రేమికులే అంటూ అసలు విషయం చెప్పేసాడు. అందరు అయోమయంగా చూస్తుండగానే.. ఏంటి చెప్పలేదా? అంటూ నూకరాజు వైపు చూసి ప్రశ్నించాడు.

nookaraju 2

వెంటనే.. నూకరాజు ఆసియా కాళ్ళు పట్టేసుకున్నాడు. మనం విడిపోయే రోజు మళ్ళీ రావద్దని కోరుకుంటున్నా అని అన్నాడు. తాను నాకోసం అన్నీ వదిలేసుకొని వచ్చిందని చెప్పుకొచ్చాడు. దీనితో ఎమోషనల్ అయిన ఆసియా “ఇలా మళ్ళీ కాళ్ళు పట్టుకునే రోజు.. మనిద్దరం గొడవ పడే రోజు మళ్ళీ రావొద్దని కోరుకుంటున్నా” అని చెప్తుంది. “ఆసియా అంటే నాకు పిచ్చి ప్రేమ.. పెళ్లి చేసుకోమంటే.. ఇక్కడే చేసేసుకుంటా..” అంటూ నూకరాజు ఎమోషనల్ అవుతూ తన ప్రేమని బయటపెట్టేసాడు.


End of Article

You may also like