Ads
ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.
Video Advertisement
కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అలా మన తెలుగు హీరోలు కూడా కొన్ని వేరే భాష సినిమాలని రీమేక్ చేశారు. మన తెలుగు హీరోలు ఎన్ని సినిమాలను రీమేక్ చేశారో ఇప్పుడు చూద్దాం.
#1 చిరంజీవి – 17
మెగాస్టార్ చిరంజీవి 17 రీమేక్ సినిమాల్లో నటించారు. అలాగే ప్రస్తుతం వేదాళం రీమేక్, మలయాళం సినిమా లూసీఫర్ రీమేక్ లో కూడా నటిస్తున్నారు.
#2 జూనియర్ ఎన్టీఆర్ – 1
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమా కన్నడ సినిమా దుర్గి రీమేక్.
#3 నాని – 2
నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా వెన్నిల కబడ్డీ తుళు రీమేక్. అలాగే ఆహా కళ్యాణం సినిమా బ్యాండ్ బాజా బారాత్ రీమేక్.
#4 రామ్ చరణ్ – 2
రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమా తని ఒరువన్ రీమేక్. అలాగే జంజీర్ సినిమా హిందీ జంజీర్ సినిమా రీమేక్.
#5 నాగార్జున – 12
అక్కినేని నాగార్జున 12 రీమేక్ సినిమాల్లో నటించారు.
#6 పవన్ కళ్యాణ్ – 10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 10 రీమేక్ సినిమాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ అయిన భీమ్లా నాయక్‌లో నటించారు.
#7 శర్వానంద్ – 2
శర్వానంద్ హీరోగా నటించిన క్లాస్ మేట్స్ సినిమా, అలాగే జాను సినిమా రీమేక్స్.
#8 వెంకటేష్ – 25
విక్టరీ వెంకటేష్ 25 రీమేక్ సినిమాల్లో నటించారు.
#9 నాగ చైతన్య – 2
నాగ చైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్. అలాగే తడాఖా కూడా తమిళంలో సూపర్ హిట్ అయిన వెట్టై రీమేక్.
#10 ప్రభాస్ – 2
ప్రభాస్ నటించిన యోగి, బిల్లా రీమేక్స్.
#11 రవితేజ – 5
రవితేజ హీరోగా నటించిన తిరుమల తిరుపతి వెంకటేశ, శంభో శివ శంభో, వీడే, దొంగోడు, నా ఆటోగ్రాఫ్ రీమేక్ సినిమాలు.
#12 సుమంత్ – 5
సుమంత్ హీరోగా నటించిన గౌరీ, నరుడా డోనరుడా, కపట దారి, స్నేహమంటే ఇదేరా, క్లాస్ మేట్స్ రీమేక్ సినిమాలు.
#13 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – 4
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన స్పీడున్నోడు, రాక్షసుడు సినిమాలు రీమేక్. అలాగే ధనుష్ హీరోగా నటించిన కర్ణన్ సినిమాని కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అంతే కాకుండా కూడా ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ డెబ్యూట్ ఇవ్వబోతున్నారు.
#14 అడివి శేష్ – 1
అడివి శేష్ నటించిన ఎవరు సినిమా హిందీలో వచ్చిన బద్లా సినిమాకి రీమేక్. బద్లా కూడా ది ఇన్విజిబుల్ గెస్ట్ సినిమాకి రీమేక్.
#15 నందమూరి బాలకృష్ణ – 12
నందమూరి బాలకృష్ణ 12 రీమేక్ సినిమాల్లో నటించారు.
#16 రామ్ పోతినేని – 2
రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా, మసాలా రీమేక్ సినిమాలు.
#17 రానా దగ్గుబాటి – 2
రానా దగ్గుబాటి ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నారు. అంతే కాకుండా అంతకు ముందు మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా బెంగళూరు డేస్ ని తమిళ్ లో బెంగళూర్ నాట్కల్ పేరుతో రీమేక్ చేశారు. మలయాళంలో ఫహాద్ ఫాజిల్ పోషించిన పాత్రని తమిళ్ లో రానా పోషించారు.
#18 నిఖిల్ సిద్ధార్థ్ – 3
నిఖిల్ హీరోగా నటించిన శంకరాభరణం, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలు రీమేక్స్.
#19 కళ్యాణ్ రామ్ – 3
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విజయదశమి, అభిమన్యు సినిమాలు రీమేక్. అలాగే ఎంత మంచి వాడవురా సినిమా కూడా ఆక్సిజన్ అనే గుజరాతి సినిమాకి అఫీషియల్ రీమేక్.
#20 నితిన్ – 2
నితిన్ హీరోగా నటించిన టక్కరి సినిమా తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన తిరువిళయాడల్ ఆరంభం అనే సినిమాకి రీమేక్. అలాగే నితిన్ నెక్స్ట్ సినిమా మాస్ట్రో కూడా హిందీలో వచ్చిన అంధాధున్ సినిమా రీమేక్.
End of Article