బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..? ఓటమి తర్వాత ఆమె ఏం నిర్ణయం తీసుకున్నారంటే.?

బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..? ఓటమి తర్వాత ఆమె ఏం నిర్ణయం తీసుకున్నారంటే.?

by Mounika Singaluri

Ads

తెలంగాణ ఎలక్షన్స్ లో నిలబడ్డ బర్రెలక్క సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో ఇండిపెండెంట్ గా ఎలక్షన్స్ లో పోటీ చేసింది. అయితే బర్రెలక్కకు సోషల్ మీడియా వేదిక విపరీతంగా మద్దతు వచ్చింది. నిరుద్యోగుల తరుపున పోరాడుతున్నానంటూ ముందుకు వచ్చిన బర్రెల అక్కకు దేశవ్యాప్తంగా కూడా మద్దతు వచ్చింది. ఏకంగా సెక్యూరిటీని కూడా కేటాయించారు. అయితే ఈరోజు వచ్చిన ఎలక్షన్ ఫలితాల్లో బర్రెలకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా? ఏ స్థానంలో నిలిచిందో తెలుసా…?

Video Advertisement

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో పలు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇలాంటి స్థానాల్లో కొల్లాపూర్ నియోజకవర్గం ఒకటి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష). అయితే తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లో బర్రెలక్క ముందజంలో నిలిచారు. దీంతో నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు స్పష్టమైంది. అయితే ఈవీఎమ్‌లలో మాత్రం బర్రెలక్క వెనకపడింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కంటే ముందు వరుసలో నిలిచిన శిరీష ఈవీఎమ్‌ ఓట్లలో వెనుకంజ వేసింది. కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.విజిల్‌ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన బర్రెలక్కకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు పోలైయ్యాయి. బర్రెలక్కకు మొత్తానికి 5754 ఓట్లు వచ్చాయి.

బర్రెలక్క ఎన్నికలలో విజయం సాధించకపోయినా కనీసం 15 వేలు నుంచి 20 వేల ఓట్లు వ‌స్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఈ అంచనాలు తారుమారయ్యాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన బర్రెలక్కకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రచారంలో దూసుకుపోయిన బర్రెలక్కకు కొల్లాపూర్ ప్రజలు అంత మద్దతు తెలపలేదు. ఈసారి బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిస్తే చరిత్ర సృష్టిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ప్రచారం మోత మోగించినా, అది ఓటు బ్యాంకుగా మారలేదని పలువురు అంటున్నారు.

అయితే ఓటమి అనంతరం బర్రెలక్క మాట్లాడుతూ… “ఓటమికి కారణం ఎక్కువ ప్రచారం చేయలేకపోయాను. ప్రజలు అంత ఈజీగా ఎవరు నమ్మరు. చిన్న ఏజ్ కాబట్టి మమ్మల్ని ఏం పాలిస్తది అన్నారు. నిరుద్యోగ సమస్య పైన అయితే పోరాటం సాగిస్తాను అని చెప్పారు బర్రెలక్క.కొల్లాపూర్ నుండే ఎంపీగా పోటీ చేస్తాను అని కూడా తెలిపారు బర్రెలక్క.


End of Article

You may also like