Ads
ఒక్కోసారి కోపం, పని ఒత్తిడి ఎంతపనైనా చేయిస్తుందనడానికి ఉదాహరణలు కోకొల్లలు.. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చోటు చేసుకుంది. సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ నర్స్ డాక్టర్ తో మాట్లాడుతూ.. అతనిపై చేయి చేసుకుంది. వెంటనే ఆ డాక్టర్ కూడా.. తిరిగి ఆమెపై చేయి చేసుకున్నట్లు చూపిస్తున్న ఈ వీడియో వైరల్ అవుతోంది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో ఓ నర్స్ కు, డాక్టర్ కు మధ్య ఓ చిన్న విషయమై విబేధాలు వచ్చాయి. మాట కు మాట అనుకున్నారు. అయితే.. మాటలు చాలా దూరం వెళ్లాయి.. సహనం నశించడం తో.. ఆ నర్స్ సదరు డాక్టర్ చెంప పగలగొట్టింది. దీనితో.. షాక్ అయిన ఆ డాక్టర్ కూడా తిరిగి ఆ నర్స్ పై చేయి చేసుకున్నాడు. వీరిద్దరి గొడవకి కారణం ఏంటంటే ఒక డెత్ సర్టిఫికెట్.
ఆసుపత్రి లో ఓ వ్యక్తి చనిపోతే.. అతని తాలూకు బంధువులు డెత్ సర్టిఫికెట్ కావాలని కోరారు. అయితే.. ఆ విషయాన్నీ ఆ నర్స్ వచ్చి డాక్టర్ ను అడిగింది. అందుకు ఆయన తనకు ఒక లెటర్ రాసి ఇవ్వమని.. అప్పుడు సర్టిఫికెట్ ఇస్తానని చెప్పాడు. దీనితో వారిద్దరి మధ్యా వాగ్వాదం మొదలైంది. ఈ ఘటనపై స్పందించిన సిటీ మేజిస్ట్రేట్ రాంజీ మిశ్రా వారిద్దరితో మాట్లాడానని.. పని ఒత్తిడి కారణంగానే అలా జరిగిందని వివరణ ఇచ్చారు.
watch video:
End of Article