“అమ్మా వచ్చేయమ్మా..” నర్సుని చూసి 3 ఏళ్ల కూతురు కంటతడి..! వీడియో చూస్తే మనకి కన్నీళ్లొస్తాయి.!

“అమ్మా వచ్చేయమ్మా..” నర్సుని చూసి 3 ఏళ్ల కూతురు కంటతడి..! వీడియో చూస్తే మనకి కన్నీళ్లొస్తాయి.!

by Anudeep

చుట్టూ ఎందరున్నా పిల్లలకు తల్లితోనే ఎక్కువ అనుబంధం..అలాంటిది తల్లి కొన్ని రోజులుగా దూరంగా ఉంటే ఆ  పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది.. చంటి పిల్లలైతే ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. అమ్మ ఎందుకు దూరంగా ఉంటుంది అని వారికి పరిస్థితి చెప్పలేము, చెప్పినా అర్దం చేసుకోలేరు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఒక సంఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది..

Video Advertisement

ముట్టుకుంటే అంటుకునే జబ్బు, ఒకరి నుండి ఒకరికి అంటుకోవడానికి పెద్దగా టైం తీసుకోదు, చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుండడంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది . దాంతో కరోనా పేషేంట్స్ కి అతి దగ్గరగా ఉంటూ వారికి ట్రెట్మెంట్ ఇస్తుండడంతో  మెడికల్ సిబ్బంది ఎవరూ తమ కుటుంబ సభ్యులను కలవట్లేదు.. కలిసినా కూడా దూరం నుండే చూసి మళ్లీ విధులకు హాజరు కావలసిన పరిస్థితి…లాక్ డౌన్ సమాయాన ఒక్కొక్కరిది ఒక్కో కథ..

బెళగావి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు సుగంధ. ఆ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ కోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసారు. సుగంధ డ్యూటీ ఆ వార్డుల్లోనే, దాంతో పదిహేను రోజులుగా ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్లోనే ఉంటూ రోగులకు సేవ చేస్తున్నారు..ఇంటికి వెళ్తే ,ఇంట్లో తన కోసం ఎదురుచూసే మూడేళ్ల  చిట్టితల్లి..అందుకని ఇంటికి వెళ్లి తన బిడ్డని బాధపెట్టలేక , బిడ్డని చూస్కోలేకపోతున్నాన్న బాధని దిగమింగుతూనే డ్యూటీ చేస్తున్నారు.

అక్కడ ఆ చిన్నారి పరిస్తితి ఇంతే, రోజు తనను చూసుకునే అమ్మ ఇన్ని రోజులైనా ఇంటికి రాలేదెందుకో ఆ చిన్నారికి అర్దం కాలేదు, చెప్పినా అర్దం చేసుకునే వయసు కాదు..ఒకటి రెండు రోజులు తండ్రి కూతురిని సముదాయించాడు . ఆ తర్వాత ఆ తండ్రి వలన కూడా కాలేదు..ఏకంగా పదిహేను రోజలు అయిపోవడంతో ఆ చిన్నారి అమ్మను బాగా మిస్ అవుతుండడంతో అమ్మని చూడాలి, కలవాలి అని పేచీ పెట్టింది.దాంతో చేసేదేం లేక  బైక్ పై బిడ్డను కూర్చొపెట్టుకుని హాస్పిటల్ కి తీస్కెళ్లిడు, దూరం నుండే తల్లిని చూపించాడు.

తల్లిని చూడగానే ఒక్కసారిగా ఆ చిన్నారి గుండె బాధ, ప్రేమ మిలితమై బోరున విలపించింది. అమ్మా రా, మమ్మీ , మమ్మీ   అంటూ గుక్కపెట్టి ఏడవసాగింది. బిడ్డ ఏడుపు చూసిన తల్లికూడా తన బాధని బిడ్డకి కనపడనీయకుండా వస్తున్న ఏడుపుని ఆపుకోవడానికి ప్రయత్నించింది. ఒకరికొకరు దూరంగానే ఉండి ఏడుస్తున్నారు. కానీ బిడ్డను ఓదార్చేందుకు తల్లి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి . దూరం నుంచే ఏడుస్తూ, బిడ్డకి బై చెప్తూ ఇక తీస్కెళ్లిపొండి అని భర్తకి చెప్పింది.

ఒకట్రెండు రోజులు బిడ్డ ఊరెళ్తేనే తిరిగి రాగానే గుండెలకు హత్తుకుని , బిడ్డల్ని మిస్ అయిన బాధని మర్చిపోతారే , అలాంటిది కళ్లముందే ఆ బిడ్డ అమ్మా ,అమ్మా అంటూ ఏడుస్తున్నా దగ్గరకుతీసుకోలేని నిస్సహాయత ఆ తల్లిది.. అమ్మా, రా అంటూ ఆ చిన్నారి గుక్క పెట్టి ఏడవడం అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది . సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో కర్ణాటక సిఎం యడ్యూరప్ప తన ట్విటర్ అకౌంట్లో వీడియో శేర్ చేసారు . అంతేకాదు సుగంధికి కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు, తన అకింతభావాన్ని ప్రశంసించారు.


You may also like